ప్రస్తుతం యువతీ యువకుల నుంచి పెద్దవాళ్ల వరకు అందరినీ ఇబ్బంది పెడుతున్న సమస్య Hair Loss. రకరకాల షాంపూలు, నూనెలు ఉపయోగించి హెయిర్ లాస్‌ను ఆపేందుకు చాలా మంది ప్రయత్నిస్తుంటారు. కొందరు డాక్టర్ల చుట్టూ తిరిగి చికిత్సలు చేయించుకుంటుంటారు. జుట్టు ఊడిపోతే చాలామంది డిప్రెషన్లోకి వెళ్తుంటారు. ఇదే సమస్యతో బాధపడుతున్న ఓ యువతి ఏకంగా ప్రాణాలే తీసుకుంది. ఈ ఘటన కర్ణాటకలోని మైసూరులో జరిగింది.
మైసూర్లో నివసిస్తున్న కావ్యశ్రీ (21) అనే యువతిని చాలా రోజులుగా హెయిర్ లాస్ సమస్య వేధిస్తోంది. డాక్టర్ల చుట్టూ తిరిగి ఎన్ని చికిత్సలు తీసుకున్నా కానీ ఫలితం లేకపోయింది. దాంతో ఆమె తీవ్ర మనస్థాపానికి గురైంది. తన సమస్యకు పరిష్కారం లేదని పూర్తి నిరాశలో కూరుకుపోయింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. దీంతో ఆమె కుటుంబంలో విషాదం నెలకొంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు.
ఇవి కూడా చదవండి