తన వివాహేతర సంబంధం గురించి తెలిసి భర్త తనను కొట్టాడనే కారణంతో ఓ మహిళ దారుణమైన స్కెచ్ వేసింది. అక్రమాయుధాల కేసులో భర్తను ఇరికించేందుకు ప్రయత్నించింది. భయపడిన భర్త ఎస్పీని ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు. ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో ఈ ఘటన జరిగింది. మీరట్‌కు చెందిన ఓ మహిళ వేరే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఆ విషయం భర్తకు తెలిసి భార్యను కొట్టాడు. తలకు తీవ్రగాయం కావడంతో ఆమెకు కుట్లు పడ్డాయి.
చికిత్స అనంతరం ఆ మహిళ తన భర్తపై పగ పెంచుకుంది. ప్రియుడితో కలిసి భర్తను ఇరికించేందుకు స్కెచ్ వేసింది. దేశవాళి తుపాకీ ఇంట్లో ఉంచి పోలీసులకు ఫోన్ చేసింది. పోలీసులు విచారణ జరిపి విషయం తెలుసుకున్నారు. ఆ ఫిర్యాదు ఫేక్ అని తేల్చారు. దీంతో భర్త జిల్లా ఎస్పీని ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు. అక్రమాయుధాల కేసులో తనను ఇరికించేందుకు భార్య చేసిన పని గురించి చెప్పారు. ప్రియుడితో కలిసి తనను చంపేందుకు ప్రయత్నిస్తోందని ఫిర్యాదు చేశారు. ఘటనపై విచారణ చేయాల్సిందిగా ఎస్పీ స్థానిక పోలీసులను ఆదేశించారు.
ఇవి కూడా చదవండి