ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పొలానికి తుపాకీ తీసుకెళ్లొద్దు.. అని సూచించిన అన్న... మాట్లాడుతుండగానే ఉన్నట్టుండి తమ్ముడు చేసిన నిర్వాకం..

ABN, First Publish Date - 2022-05-17T17:42:56+05:30

కొందరు చిన్న చిన్న సమస్యలను పెద్దవి చేసుకుని.. చివరకు హత్యలు, ఆత్మహత్యల వరకు వెళ్తుంటారు. కొందరైతే.. పెద్దవారు చెప్పే నీతులను పాటించకపోగా.. వారిపైనే దౌర్జన్యానికి...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కొందరు చిన్న చిన్న సమస్యలను పెద్దవి చేసుకుని.. చివరకు హత్యలు, ఆత్మహత్యల వరకు వెళ్తుంటారు. కొందరైతే.. పెద్దవారు చెప్పే నీతులను పాటించకపోగా.. వారిపైనే దౌర్జన్యానికి పాల్పడుతుంటారు. ఇలాంటి ఘటనలు ఇటీవల చాలా చూశాం. ఉత్తరప్రదేశ్‌లో తాజాగా ఇదే కోవలో ఓ ఘటన చోటు చేసుకుంది. పొలానికి తుపాకీతో తీసుకెళ్తున్న తమ్ముడిని వారించాడు. సూచనలు పాటించాల్సిన తమ్ముడు అందుకు విరుద్ధంగా ప్రవర్తించాడు. మాట్లాడుతుండగానే ఉన్నట్టుండి తమ్ముడు చేసిన నిర్వాకానికి అంతా షాక్ అయ్యారు. వివరాల్లోకి వెళితే...


ఉత్తరప్రదేశ్ రాష్ట్రం చాంద్‌పూర్‌లోని డాటియానాలో సోమవారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానికంగా నివాసం ఉంటున్న రూపేంద్ర(28), బ్రజ్‌వీర్‌ అనే అన్నదమ్ముల మధ్య తుపాకీ విషయమై గొడవ జరిగింది. సోమవారం రాత్రి పొలానికి కాపలాగా వెళ్లే సమయంలో బ్రజ్‌వీర్‌ తుపాకీ తీసుకెళ్లేందుకు ప్రయత్నించాడు. గమనించిన అన్న రూపేంద్ర.. తుపాకీ తీసుకెళ్లొద్దు అంటూ తమ్ముడిని మందలించాడు. దీంతో బ్రజ్‌వీర్‌ ఒక్కసారిగా కోపోద్రిక్తుడయ్యాడు. నాకే సలహా ఇస్తావా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. అన్న మాట్లాడుతుండగానే.. తుపాకీతో కాల్పులు జరిపాడు.

కోట్లు వద్దు.. ఒక్కసారైనా కూర్చుంటే చాలంటున్న మహిళ.. ఇదేం కోరిక అని ఆవాక్కవుతున్నారా..? ఆమె సమస్యేంటో తెలిస్తే..


రూపేంద్ర కడుపులోకి బుల్లెట్లు దూసుకెళ్లడంతో తీవ్ర గాయాలపాలయ్యాడు. గమనించిన కుటుంబ సభ్యులు అతన్ని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే రూపేంద్ర మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని పరిశీంచారు. తుపాకీ లైసెన్స్ వారి తండ్రి అశోక్ పేరు మీద ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. నిందితుడిని అరెస్ట్ చేశారు. సలహా ఇచ్చిన పాపానికి అన్ననే పొట్టనపెట్టుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం కలిగించింది. పెద్ద కొడుకు మృతితో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

చలనం లేకుండా పడి ఉన్న తల్లి పక్కన 6నెలల చిన్నారి ఒకటే ఏడుపు.. స్థానికులు కంగారుగా వెళ్లి చూడగా..

Updated Date - 2022-05-17T17:42:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising