ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ten years దాంపత్య జీవితం.. మధ్యలో ప్రియుడితో ప్రేమాయణం.. చివరకు ఇంత నాటకం ఆడుతుందని ఎవరూ ఊహించలేకపోయారు..

ABN, First Publish Date - 2022-08-01T01:09:40+05:30

వారికి వివాహమై పదేళ్లయింది. ప్రస్తుతం వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. సంతోషంగా సాగుతున్న సంసారంలో ఇటీవల అనుకోని సమస్యలు (problems) వచ్చిపడ్డాయి. భర్తకు తెలీకుండా భార్య..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వారికి వివాహమై పదేళ్లయింది. ప్రస్తుతం వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. సంతోషంగా సాగుతున్న సంసారంలో ఇటీవల అనుకోని సమస్యలు (problems) వచ్చిపడ్డాయి. భర్తకు తెలీకుండా భార్య పరాయి వ్యక్తిని ఇష్టపడింది. భర్తకు తెలీకుండా రోజూ ప్రియుడిని కలుస్తూ ఉండేది. ఈ క్రమంలో ఓ రోజు అనుకోకుండా ఈ విషయం భర్తకు తెలిసింది. దీంతో ప్రియుడితో కలిసి చివరకు ఇంత నాటకం ఆడుతుందని ఎవరూ ఊహించలేకపోయారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. 


బీహార్ (Bihar) రాష్ట్రం బెగుసరాయ్‌ (Begusarai) పరిధి సుధారన్ గ్రామానికి చెందిన  శత్రుఘ్న పాశ్వాన్‌కు పదేళ్ల క్రితం గుంజన్ దేవి, ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఏడాది కిందటి వరకూ దంపతుల మధ్య ఎలాంటి సమస్యలూ లేవు. అయితే తర్వాత గుంజన్ దేవికి.. విపిన్ పాశ్వాన్ అనే వ్యక్తి పరిచయమయ్యాడు. కొన్నాళ్లకు వీరి మధ్య వివాహేతర సంబంధం (extramarital affair) ఏర్పడింది. భర్తకు తెలీకుండా ప్రియుడితో తరచూ రాసలీలలు సాగించేది. ఇటీవల ఓ రోజు ఈ విషయం భర్తకు తెలిసింది. దీంతో దంపతుల మధ్య గొడవలు మొదలయ్యాయి. ఇంకోసారి ఇలాంటి పనులు చేస్తే.. బాగుండదంటూ భార్యను మందలించాడు. అప్పటి నుంచి ఎలాగైనా భర్త అడ్డు తొలగించుకోవాలని ప్రియుడితో కలిసి వివిధ రకాలుగా పథకం రూపొందించేవారు.

student love: మధ్యాహ్న సమయంలోనూ తలుపులు మూసిన విద్యార్థి.. ఎంత తట్టినా తీయకపోవడంతో బద్దలు కొట్టి చూడగా..


ఈ క్రమంలో జూలై 26న రాత్రి పడుకున్న భర్తను ప్రియుడితో కలిసి హత్య చేసింది. అనంతరం ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు మృతదేహాన్ని ఉరికి వేలాడదీశారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. భార్య మీద అనుమానం రావడంతో అదుపులోకి తీసుకుని విచారించగా, అసలు నిజం వెలుగులోకి వచ్చింది. దీంతో గుంజన్ దేవి, ఆమె ప్రియుడిని శనివారం అరెస్ట్ చేశారు. ఈ ఘటనతో స్థానికంగా విషాదచాయలు అలుముకున్నాయి.

Suspicious incident: ఊరికి దూరంగా భర్త.. ట్యూషన్ టీచర్‌తో రాత్రంతా భార్య సంభాషణ.. పొద్దున లేచి చూస్తే..



Updated Date - 2022-08-01T01:09:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising