ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Viral Video: మాటలు నేర్చిన శునకం.. ఫిదా అవుతున్న నెటిజన్లు

ABN, First Publish Date - 2022-11-18T11:44:08+05:30

ఓ రెండాకులు ఎక్కువే చదివేసిందండయో. ఏకంగా మనుషులను హలో అంటూ పలకరించేస్తుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నటకిరీటి రాజేంద్రప్రసాద్ నవ్వుల కిరీటి కూడా. ఆయన నటించిన సినిమాలు కడుపుబ్బా నవ్విస్తాయి.ఓ సినిమాలో ఆయన మేకతో మాట్లాడించే సీన్ మీకు గుర్తుండే ఉంటుంది. అందులో రాజేంద్రప్రసాద్ మేకను ఏప్రిల్ తర్వాత నెల ఏంటంటే మే.. అంటుంది. అలాగే జూన్ ముందు నెల ఏమిటంటే కూడా… మే… అంటుంది. అలా దాన్ని మాట్లాడే మేకగా చెప్పి వేరే వారికి విక్రయిస్తాడు. ఇదంతా ఇప్పుడు ఎందుకు చెబుతున్నామంటే.. అచ్చం ఆ సినిమాలోని మాట్లాడే మేకలానే.. ఓ మాట్లాడే శునకం ఉంది. అది మేక కంటే ఓ రెండాకులు ఎక్కువే చదివేసిందండయో. ఏకంగా మనుషులను హలో అంటూ పలకరించేస్తుంది. ఇది నిజంగానే నిజం. అసలు ఈ మాట్లాడే శునకం ఎక్కడుంది. దాని పూర్తి వివరాలు తెలియాలంటే మనం అసలు కథలోకి వెళ్లాల్సిందే..

పిల్లలు పెద్దవాళ్ళను అనుకరించినట్టే పెంపుడు జంతువులు కూడా వారి యజమానులను అనుకరిస్తూ ఉంటాయి. యజమానులు పిలిచినప్పుడు అవి స్పందించే తీరు చాలా నవ్వు తెప్పించేదిగానూ, ఆహ్లాదాన్ని పంచేదిగానూ ఉంటుంది. ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేయబడిన ఓ వీడియో ఇప్పుడలాగే అందరినీ అలరిస్తోంది. లోర్నా అనే పేరు కలిగిన శునకాన్ని తన యజమాని 'లోర్నా..' అని పిలవగానే ఆ శునకం మనుషులు స్పందించినట్టు 'హలో..' అనే శబ్దం వచ్చేలాగా అరుస్తుంది. ఈ హలో అనేది హిరో.. అనే శబ్దానికి దగ్గరగా ఉన్నా ఈ శునకం అనుకరించాలని చూసిన విధానానికి నెటిజన్లు చాలా ముచ్చట పడుతున్నారు.

'నేను ఇప్పటివరకు విన్న హలో అనే మాటలో ఇది చాలా ఆహ్లదకరమైనది' అని ఒకరంటే.. 'నేను దీన్ని ఎన్నిసార్లు చూసానో లెక్కలేదు.. అని మరొకరు కామెంట్ చేశారు. ఈ శునకం చెబుతున్న హలో నాకు సంవత్సరానికి సరిపడా నూతనోత్సాహాన్ని ఇస్తోంది అని ఇంకొకరు స్పందించారు. ఇలా ఈ హైపర్ యాక్టీవ్ శునకం తన హలోతో ఎంతో మందిని ఖుషీ చేసిందని వేరే చెప్పాలా..

Updated Date - 2022-11-18T11:44:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising