ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Bihar news: టీచర్‌ను పాఠశాల బయటే ఉంచి తాళం వేసిన గ్రామస్తులు.. చివరకు ఈ విషయం ఎంతవరకు వెళ్లిందంటే..

ABN, First Publish Date - 2022-08-02T22:06:17+05:30

ప్రభుత్వ పాఠశాలలో కొందరు టీచర్ల నిర్లక్ష్యం కారణంగా పేద విద్యార్థులకు మెరుగైన విద్య అందడం లేదు. ఇంకొందరు టీచర్లు విద్యను బోధించకపోగా విద్యార్థుల పట్ల దారుణంగా ప్రవర్తిస్తుంటారు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రభుత్వ పాఠశాలలో కొందరు టీచర్ల నిర్లక్ష్యం కారణంగా పేద విద్యార్థులకు మెరుగైన విద్య అందడం లేదు. ఇంకొందరు టీచర్లు విద్యను బోధించకపోగా విద్యార్థుల పట్ల దారుణంగా ప్రవర్తిస్తుంటారు. చిన్న చిన్న కారణాలకే పిల్లలపై అమానుషంగా దాడి చేస్తుంటారు. ఇందుకు సంబంధించిన వార్తలు ఇటీవల సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. బీహార్‌లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న టీచర్‌పై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. చివరకు ఆమెను తరగతి గది బయటే పెట్టి తాళం వేశారు. ఈ విషయం చివరకు ఎంత వరకు వెళ్లిందంటే..


బీహార్ (Bihar) రాష్ట్రం సివాన్‌‌లోని వుడ్ నబీగంజ్ బ్లాక్ పరిధి బాలా గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల (Government school) లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ పాఠశాల ఉపాధ్యాయులు విధులకు సక్రమంగా రావడం లేదనే విమర్శలు చాలా కాలం నుంచి ఉన్నాయి. దీంతో విద్యార్థుల చదువుకు ఆటంకం కలుగుతోందని, సమయానికి మధ్యాహ్న భోజనం కూడా అందడం లేదని గ్రామస్తులు పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేశారు. అయినా పాఠశాల ఉపాధ్యాయుల తీరులో మార్పు రాలేదు. కొందరు ఉపాధ్యాయులు పాఠశాలకు రాకున్నా హాజరు వేసుకుంటున్నారు. ఉపాధ్యాయుల తీరులో మార్పు రాకపోవడంతో చివరకు గ్రామస్తుల కోపం కట్టలు తెంచుకుంది. మంగళవారం చాలా మంది గ్రామస్తులు పాఠశాల వద్దకు చేరుకున్నారు.

Indecent behavior on young lady: కోచింగ్‌కు వచ్చిన యువతిని.. పొలంలోని గదికి తీసుకెళ్లి.. నాలుగు నెలలుగా వీడియో తీయడమే కాకుండా...


ఆలస్యంగా పాఠశాలకు వచ్చిన ఉపాధ్యాయురాలు లోపలికి రాకుండా తాళాలు వేశారు. దీంతో ఆమె వారిపై తీవ్ర ఆగ్రహం చేసింది. అక్కడే ఉన్న కొందరు ఈ ఘటనను మొత్తం వీడియో తీశారు. టీచర్ల నిర్లక్ష్యంపై పాఠశాల ప్రధానోపాధ్యాయుడిని విచారించగా.. తనకు సమాచారం ఇవ్వకుండానే సెలవులు తీసుకుంటున్నారని చెప్పారు. చివరకు ఈ విషయం  జిల్లా విద్యాశాఖాధికారి (District Education Officer) వరకూ వెళ్లింది. ఉపాధ్యాయుల నిర్లక్ష్య వైఖరిపై దర్యాప్తు చేస్తున్నామని, ఆరోపణలు రుజువైతే కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

young woman స్పృహలోకి రాగానే పారిపోయిన స్నేహితుడు.. పార్టీ పేరు చెప్పి అతడు ఆడిన డ్రామా ఏంటంటే..



Updated Date - 2022-08-02T22:06:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising