ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Viral Video: పిల్ల జిరాఫీపై తండ్రి జిరాఫీ ప్రేమ.. ఆప్యాయంగా ముద్దాడేందుకు ఎంత తపన పడుతుందో చూడండి..

ABN, First Publish Date - 2022-05-29T23:09:29+05:30

పిల్లలపై ప్రేమ చూపించాల్సిన తల్లిదండ్రులు.. కర్కశత్వం చూపిస్తూ, పైశాసిక ఆనందం పొందడాన్ని తరచూ చూస్తూనే ఉన్నాం. ఓ చోట తల్లి తన పిల్లలను చిత్రహింసలకు గురి చేస్తుంటే.. మరో చోట...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పిల్లలపై ప్రేమ చూపించాల్సిన తల్లిదండ్రులు.. కర్కశత్వం చూపిస్తూ, పైశాసిక ఆనందం పొందడాన్ని తరచూ చూస్తూనే ఉన్నాం. ఓ చోట తల్లి తన పిల్లలను చిత్రహింసలకు గురి చేస్తుంటే.. మరో చోట తండ్రులు ఏకంగా ప్రాణాలు తీసేంత పని చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు ఇటీవల తరచూ చోటు చేసుకోవడం తెలిసిందే. ఇలాంటి ఘటనలు చూసినప్పుడు.. పిల్లలపై ప్రేమ చూపించడంలో మనుషుల కంటే జంతువులే మేలని అనిపిస్తుంది. ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో ఓ జిరాఫీ తన పిల్లను చూడగానే ఆప్యాయంగా దగ్గరికి తీసుకునేందుకు పడే తపనను చూసి.. నెటిజన్లు ఫిదా అవుతున్నారు.


అమెరికాలోని కాలిఫోర్నియాలోని శాంటా బార్బరా జూలో ఈ ఘటన చోటు చేసుకుంది. అప్పుడే పుట్టిన ఓ పిల్ల జిరాఫీ, తన తల్లి జిరాఫీని ఓ ఎన్‌క్లోజర్‌లో ఉంచారు. కాసేపటికి జూ సిబ్బంది తండ్రి జిరాఫీని అక్కడికి తీసుకొస్తారు. అయితే లోపలికి వెళ్లగానే తన పిల్లను చూసి తండ్రి జిరాఫీ ఆనందంతో దగ్గరికి వెళ్తుంది. అయితే మధ్యలో ఇనుప గ్రిల్ ఉంటుంది. అయినా తలను ఇనుప ఊచల మధ్యలోంచి లోపలికి పెట్టి, తన పిల్లను ముద్దాండేందుకు ప్రయత్నిస్తుంది. బుడి బుడి అడుగులు వేస్తున్న పిల్ల జిరాఫీని.. తదేకంగా చూస్తున్న తండ్రి జిరాఫీ.. అందరినీ ఆకట్టుకుంటోంది. కొడుకు పుట్టగానే తండ్రికి ఉండే ప్రేమను... ఈ జిరాఫీ కళ్లకు కట్టినట్లు చూపించిందని, నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది.

పావురాన్ని వేటాడేందుకు పొంచివున్న పిల్లి.. తీరా దగ్గరికి వెళ్లి.. ఏం చేసిందో మీరే చూడండి...





Updated Date - 2022-05-29T23:09:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising