Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement
Published: Fri, 27 May 2022 21:16:06 IST

Viral Video: పావురాన్ని వేటాడేందుకు పొంచివున్న పిల్లి.. తీరా దగ్గరికి వెళ్లి.. ఏం చేసిందో మీరే చూడండి...

twitter-iconwatsapp-iconfb-icon

వేట దొరికితే ఎవరైనా వదిలిపెడతారా..! అంటే నో అని సమాధానం చెబుతాం. మనుషులకైతే మానవత్వం ఉంటుంది కాబట్టి.. అప్పుడప్పుడూ కనికరం చూపిస్తారు. కానీ జంతువులు మాత్రం సాధారణంగా వదిలిపెట్టవు. వేట దొరకడమే ఆలస్యం.. ఇలా దాడి చేసి, అలా నోట కరుచుకుంటాయి. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే పిల్లి మాత్రం ఇందుకు పూర్తి విరుద్ధంగా ఉంది. పావురాన్ని వేటాడేందుకు చాలా సేపటి నుంచి పొంచి ఉంది. అయితే తీరా దగ్గరికి వెళ్లి.. అది చేసిన పనిని చూసిన నెటిజన్లు వావ్.. ఈ పిల్లి వెరైటీగా ఉందే అని అంటున్నారు...

ట్విట్టర్‌లో ఓ వీడియో వైరల్ అవుతోంది. వేట కోసం పిల్లి పొంచి ఉంటుంది. అదే సమయంలో దానికి కొంచెం దూరంలో ఓ పావురం వచ్చి వాలుతుంది. ఇంకేముందీ.. పంట పండింది అని అనుకుంటుంది. ఎలాగైనా తినేయాలని మెల్లగా అడుగులో అడుగు వేసుకుంటూ దాని దగ్గరకు వెళ్తుంది. అయితే పిల్లి వస్తున్న విషయం పావురానికి తెలిసినా.. ఎగిరిపోకుండా అలాగే ఉండిపోతుంది. మెల్లగా పావురం దగ్గరికి వెళ్లిన పిల్లి.. ఒక్కసారిగా మనసు మార్చుకుంటుంది. పావురం ధైర్యం నచ్చిందో, లేక దానిపై జాలి కలిగిందో ఏమో తెలీదు గానీ దగ్గరికి వెళ్లి.. ఒక్కసారిగా దాని తలపై కిస్ చేస్తుంది. అయినా పావురం ఏమాత్రం కదలకుండా అలాగే ఉండిపోతుంది. దీంతో ఇదే పావురం రా నాయనా.. నేనంటే కొంచెం కూడా భయం లేదు.. అన్నట్లుగా పిల్లి రియాక్షన్ ఇస్తుంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఈ జింకను చూసి మనుషులు చాలా నేర్చుకోవాలి.. ఎంత జాగ్రత్తగా రోడ్డు దాటుతుందో మీరే చూడండి..



ఇవి కూడా చదవండిLatest News in Telugu

నలభై ఏళ్ల వయసులో దంపతుల మధ్య గొడవలు.. భర్తపై విరక్తి చెంది రోజూ ఫేస్‌బుక్‌లో సెర్చింగ్... చివరకు యువకుడి పరిచయంతో..పందికొక్కుతో ఫుట్‌బాల్ ఆడుకున్న పెంపుడు కుక్కలు.. తీరా నోటికందే సమయంలో ఊహించని ట్విస్ట్..videoViral Video: 20 నిమిషాల ముందే స్టేషన్ కు చేరిన రైలు.. ప్రయాణికుల రియాక్షన్ చూస్తే.. videoఫోన్ వచ్చిందని రాత్రి బయటకు వెళ్లిన 25 ఏళ్ల కుర్రాడు.. తెల్లారేసరికి రైల్వే బ్రిడ్జ్ కింద శవంగా.. 19 ఏళ్ల ఆ కుర్రాడి పనేనని.. పెళ్లిలో దండలు మార్చుకుంటుండగా అనుకోని ఘటన.. సిగ్గుతో తల తిప్పుకొన్న వధువు.. ఇంతకీ ఏం జరిగిందంటే.. videoఈ దొంగ చాలా విచిత్రంగా ఉన్నాడే.. ఇంట్లో చోరీ చేసి.. చివరగా టీవీపై అతడు రాసిన సందేశం చూసి యజమాని షాక్..
Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

ప్రత్యేకంLatest News in Teluguమరిన్ని...

Advertisement
OpinionPoll
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.