ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Viral Video: పిల్ల ఏనుగును పట్టుకున్న మొసలి.. ఆగ్రహంతో ఊగిపోయిన తల్లి ఏనుగు.. ఏం చేసిందో చూడండి..

ABN, First Publish Date - 2022-08-03T23:08:01+05:30

ఏనుగు ఎంత బలమైన జంతువో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మిగతా జంతువులు వాటి జోలికి వెళ్లాలంటే ఒకటికి పదిసార్లు ఆలోచిస్తాయి. ఏనుగులకు (Elephants) కోపం వచ్చిన..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏనుగు ఎంత బలమైన జంతువో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మిగతా జంతువులు వాటి జోలికి వెళ్లాలంటే ఒకటికి పదిసార్లు ఆలోచిస్తాయి. ఏనుగులకు (Elephants) కోపం వచ్చిన సందర్భాల్లో బీభత్సం సృష్టించడం చూస్తూనే ఉంటాం. మామూలుగానే ఇలా చేస్తే.. ఇక వాటి పిల్లల జోలికి వెళ్తే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. పిల్ల ఏనుగు జోలికి వచ్చిన మొసలి (Crocodile) కి ఈ విషయం బాగా అర్థమైంది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. పిల్ల ఏనుగును తినేయాలని చూసిన మొసలి పరిస్థితి చివరకు ఏమైందో మీరే చూడండి..


ట్విట్టర్‌లో ఓ వీడియో వైరల్ (Viral video) అవుతోంది. ఓ అడవిలో కొన్ని ఏనుగులు కలిసి నీరు తాగేందుకు వెళ్తాయి. అయితే అప్పటికే ఆహారం కోసం అక్కడ కొన్ని మొసళ్లు కాపుగాసి ఉంటాయి. దీన్ని గమనించని మొసళ్లు.. అక్కడికి వెళ్లి నీరు తాగుతుంటాయి. ఈ క్రమంలో ఓ పిల్ల ఏనుగును మొసలి టార్గెట్ చేస్తుంది. దగ్గరికి రాగానే చటుక్కున తొండాన్ని పట్టుకుంటుంది. దీంతో ఆ ఏనుగు ఒక్కసారిగా బాధతో ఘీంకరిస్తుంది. పారిపోతున్న తల్లి ఏనుగుకు విషయం అర్థమవుతుంది. తన పిల్లను కాపాడుకునేందుకు ప్రయత్నిస్తుంది. కానీ మొసలి గట్టిగా పట్టుకుంటుంది. దీంతో తల్లి ఏనుగుకు కోపం కట్టలు తెంచుకుంటుంది. దంతాలతో గట్టిగా ఒక పోటు పొడుస్తుంది. దెబ్బకు మొసలి పిల్ల ఏనుగును వదిలేస్తుంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు వివిధ రకాలుగా కామెంట్లు పెడుతున్నారు. 

Viral Video: పాము, ఉడతల పోరాటం.. మధ్యలో నేనున్నా అంటూ ఎగిరొచ్చిన పక్షి..





Updated Date - 2022-08-03T23:08:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising