ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Viral Video: వామ్మో! మొసలిపై దర్జాగా కూర్చుని మరీ డ్యాన్స్ చేస్తున్నాడు.. చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే...

ABN, First Publish Date - 2022-04-06T03:27:42+05:30

క్రూర జంతువులతో మనుషులు స్నేహం చేయడం చూస్తూనే ఉంటాం. ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. మనుషులను చూస్తేనే దాడి చేసే పులులు, సింహాలు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

క్రూర జంతువులతో మనుషులు స్నేహం చేయడం చూస్తూనే ఉంటాం. ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. మనుషులను చూస్తేనే దాడి చేసే పులులు, సింహాలు.. అందుకు విరుద్ధంగా స్నేహంగా మెలగడం చూసినప్పుడు ఆశ్చర్యం కలుగుతుంది. ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో ఓ వ్యక్తి మొసలితో స్నేహం చేయడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. మొసలిపై దర్జాగా కూర్చున్న ఆ వ్యక్తి.. అంతటితో ఆగకుండా డ్యాన్స్ చేయడం నెటిజన్లను తెగ ఆకట్టుకుంటోంది. దీంతో ఈ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది.


ఇన్‌స్టాగ్రాంలో వైరల్ అవుతున్న వీడియోలో ఓ వ్యక్తి మొసళ్ల సంరక్షణ బాధ్యతలు చూసుకుంటూ ఉంటాడు. ఓ పెద్ద మొసలి నోరు తెరుచుకుని ఉంటుంది. వెంటనే దాని నోట్లో మాంసం ముక్కలను విసిరేస్తాడు. మాంసాన్ని మొసలి తింటూ ఉండగా.. ఆ వ్యక్తి దానిపై దర్జాగా కూర్చుంటాడు. అంతటితో ఆగకుండా ఖుషీ ఖుషీగా డ్యాన్స్ చేస్తాడు. అయినా మొసలి మాత్రం కిక్కురుమనకుండా ఉంటుంది. చేతితో మొసలి తలపై తట్టినా.. సైలెంట్‌గా ఉండడం అందరినీ ఆశ్యర్యానికి గురి చేస్తుంది. తర్వాత మొసలి తల వైపునకు వెళ్లి కూర్చుంటాడు. అందరివైపు చేయి చూపిస్తూ, పాట పాడుతూ... మొసలితో మాట్లాడుతున్నట్లు నటిస్తాడు. అయినప్పటికీ మొసలి మాత్రం బుద్ధిగా పడుకునే ఉంటుంది. ఈ వీడియోపై నెటిజన్లు వివిధ రకాలుగా కామెంట్లు పెడుతున్నారు. 

కూరలో కావాలనే ఉప్పు ఎక్కువగా కలిపి టేస్ట్ చూడమన్న భార్య.. ఆ భర్త రియాక్షన్‌కు నెటిజన్లు ఫిదా





Updated Date - 2022-04-06T03:27:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising