Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement
Published: Tue, 05 Apr 2022 17:00:11 IST

Viral Video: కూరలో కావాలనే ఉప్పు ఎక్కువగా కలిపి టేస్ట్ చూడమన్న భార్య.. ఆ భర్త రియాక్షన్‌కు నెటిజన్లు ఫిదా

twitter-iconwatsapp-iconfb-icon
Viral Video: కూరలో కావాలనే ఉప్పు ఎక్కువగా కలిపి టేస్ట్ చూడమన్న భార్య.. ఆ భర్త రియాక్షన్‌కు నెటిజన్లు ఫిదా

భార్యాభర్తల మధ్య గొడవలు జరగడం, మళ్లీ కలిసిపోవడం మామూలే. కొన్నిసార్లు భర్తపై చూపించాల్సిన కోపాన్ని.. ఇంట్లోని వంట పాత్రలపై లేదంటే చిన్న పిల్లలపై చూపిస్తుంటారు. కొందరు మహిళలు అన్నం, కూరలు సక్రమంగా చేయకుండా తమ కోపాన్ని చూపిస్తుంటారు. చాలా మంది దంపతులు సరదా సరదాగా ఒకరిపై ఒకరు వింత వింత ప్రయోగాలు చేసుకుంటూ ఉంటారు. ప్రస్తుత స్మార్ట్ ఫోన్ యుగంలో ఇలాంటి వీడియోలకు కొదువే లేదు. ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో ఓ మహిళ.. కూరలో ఉప్పు కలిపి భర్తకు తినిపిస్తుంది. కూర రుచి చూసి.. భర్త ఇచ్చిన రియాక్షన్ చూసి, నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

@haappyyou అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఈ వీడియోను పోస్టు చేశారు. వంట గదిలో ఓ మహిళ కూర చేసి సిద్ధంగా ఉంచుతుంది. అయితే భర్తపై కోపమో, లేక సరదాగా ఆటపట్టించాలనో తెలీదు గానీ, ఓ స్పూన్‌తో కొంచెం ఉప్పు తీసుకుని.. అందులో కూర కలుపుతుంది. నేరుగా ఆ స్పూన్ తీసుకుని భర్త గదిలోకి వెళ్తుంది. ఒకసారి రుచి చూసి చెప్పు.. అంటూ భర్తకు తినిపిస్తుంది. కూర రుచి చూసిన భర్త.. ‘‘వావ్! చాలా అద్భుతంగా ఉందంటూ రియాక్షన్ ఇస్తాడు. అతడి మొఖంలో ఉప్పు తిన్న భావన ఏమాత్రం లేకపోవడాన్ని చూసి... అతడి భార్య అవాక్కవుతుంది. ఈ వీడియోపై నెటిజన్లు వివిధ రకాలుగా కామెంట్లు పెడుతున్నారు. ‘‘అతడికి కొవిడ్ సోకిందేమో.. అందుకే ఉప్పు తిన్నా ఏమీ తెలియట్లేదు’’ అని ఒకరు.. ‘‘కూరలో ఉప్పు వేసి ఉండకపోవచ్చు.. అందుకే ఉప్పు కలిపినా సందేహం రాలేదు’’.. అని మరొకరు స్పందిస్తున్నారు.

వధూవరులిద్దరికీ జ్యూస్‌ తాగించి.. ఎంత పని చేశారు.. తీరా చూస్తే..



ఇవి కూడా చదవండిLatest News in Telugu

నాలుగేళ్లుగా వీడని మిస్టరీ.. ఇంతకీ ఈ 24 ఏళ్ల యువతి ఏమైపోయింది..? అసలేం జరిగిందంటే..కొత్త కోడలు చెప్పిందని రోజూ రాత్రి పాలు తాగుతున్న కుటుంబ సభ్యులు.. మూడో రోజు పొద్దున్నే లేచి చూస్తే..గుర్తు తెలీని అమ్మాయి నుంచి ఫ్రెండ్ రిక్వెస్ట్.. సరదాగా చాటింగ్ మొదలు పెట్టాడు.. కానీ చివరకు షాకింగ్ ట్విస్ట్..రాత్రి వేళ ప్రజలు ఉగాది వేడుకల్లో ఉండగా.. ఆకాశంలో ఒక్కసారిగా మెరుపులు.. ఉన్నట్టుండి భూమిపై పడిన వస్తువులు చూసి..ఒక్క ఫోన్‌తో ప్రయాణికులను హడలెత్తించిన 12 ఏళ్ల పిల్లాడు.. ఎందుకిలా చేశావని రైల్వే పోలీసులు నిలదీస్తే.. వ్యభిచారం నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్న భర్త.. పోలీసులకు పట్టుబడ్డ మహిళ.. అతడి భార్యే అని తెలిసి..
Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

ప్రత్యేకంLatest News in Teluguమరిన్ని...

Advertisement
OpinionPoll
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.