ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కనీవినీ ఎరుగని వింత ఘటన.. ఎలుకను చంపినందుకు కేసు.. 10 గంటల పాటు విచారణ..!

ABN, First Publish Date - 2022-11-30T16:16:30+05:30

ఎలుక పట్ల క్రూరంగా వ్యవహరించి, దానిని చంపినందుకు ఓ వ్యక్తి భారీ మూల్యం (UP man Booked for killing Rat) చెల్లించాడు. ఎలుకకు రాయి క‌ట్టి నీటిలో ముంచిన వ్య‌క్తిపై పోలీసులు వివిధ సెక్ష‌న్ల కింద కేసు నమోదు చేశారు. యూపీలోని బ‌దౌన్‌లో ఈ ఘటన వెలుగు చూసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎలుక పట్ల క్రూరంగా వ్యవహరించి, దానిని చంపినందుకు ఓ వ్యక్తి భారీ మూల్యం (UP man Booked for killing Rat) చెల్లించాడు. యూపీలోని బ‌దౌన్‌లో ఈ ఘటన వెలుగు చూసింది. ఎలుకకు రాయి క‌ట్టి నీటిలో ముంచిన వ్య‌క్తిపై పోలీసులు వివిధ సెక్ష‌న్ల కింద కేసు నమోదు చేశారు. జంతు హ‌క్కుల కార్య‌క‌ర్త ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితుడిని స్టేషన్‌కు పిలిపించారు. ఏకంగా పది గంటల పాటు విచారించారు.

బదౌన్ పట్టణానికి చెందిన మనోజ్ కుమార్ అనే వ్యక్తి ఎలుకను ఓ ఇటుక రాయికి కట్టేసి దాన్ని డ్రైనేజిలోకి విసిరేశాడు. తోకను ఇటుకరాయికి కట్టడంతో ఆ ఎలుక తప్పించుకోలేక నీటిలో మునిగిపోయింది. ఆ ఎలుకను కాపాడేందుకు జంతు హక్కుల ఉద్యమకారుడు వికేంద్ర శర్మ ప్రయత్నించారు. ఆ మురికి కాలువ నుంచి ఎలుకను ఆయన బయటికి తీశారు. అయితే, కాసేపటికే ఆ ఎలుక ప్రాణాలు కోల్పోయింది. కాగా, ఎలుకను మనోజ్ హింస్తున్న ఘటనకు సంబంధించిన దృశ్యాలను వికేంద్ర శర్మ వీడియో తీసి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు మనోజ్‌పై కేసు నమోదు చేసుకున్నారు. ఎలుకతో క్రూరంగా వ్యవహరించి దాని ప్రాణాలు తీసిన మనోజ్ కుమార్‌పై పోలీసులు సెక్షన్ 429, సెక్షన్ 11 (1) (1)ల కింద కేసులు నమోదు చేశారు. మనోజ్‌ను స్టేషన్‌కు పిలిపించి పది గంటల పాటు విచారించారు. చనిపోయిన ఎలుకను ఫోరెన్సిక్ పరీక్షల నిమిత్తం బదౌన్ వెటర్నరీ ఆసుపత్రికి తరలించారు.

Updated Date - 2022-11-30T16:16:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising