ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Coins stuck in throat: ఓ డాక్టర్ వింత పద్ధతి.. ఆపరేషన్ అక్కర్లేదు.. గొంతులోంచి కాయిన్స్‌ను ఎలా బయటకు తీస్తాడంటే..

ABN, First Publish Date - 2022-12-19T15:26:24+05:30

చిన్న పిల్లలు అప్పడప్పుడు రూపాయి లేదా రెండు రూపాయల కాయిన్స్ మింగేస్తుంటారు. చాలా సార్లు అవి గొంతులో ఇరుక్కుపోయి ప్రాణాలకు కూడా ప్రమాదం వాటిల్లుతుంటుంది. డాక్టర్లు ఆ కాయిన్‌ను బయటకు తీయడానికి ఆపరేషన్ చేస్తుంటారు. అయితే మధ్యప్రదేశ్‌లోని ఛతర్పూర్‌కు చెందిన ఓ డాక్టర్ ప్రత్యేకమైన పద్ధతిని అనుసరిస్తున్నాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చిన్న పిల్లలు అప్పడప్పుడు రూపాయి లేదా రెండు రూపాయల కాయిన్స్ మింగేస్తుంటారు. చాలా సార్లు అవి గొంతులో ఇరుక్కుపోయి ప్రాణాలకు కూడా ప్రమాదం వాటిల్లుతుంటుంది. డాక్టర్లు ఆ కాయిన్‌ను బయటకు తీయడానికి ఆపరేషన్ చేస్తుంటారు. అయితే మధ్యప్రదేశ్‌లోని (Madhya Pradesh) ఛతర్పూర్‌కు చెందిన ఓ డాక్టర్ ప్రత్యేకమైన పద్ధతిని అనుసరిస్తున్నాడు. చిన్న రబ్బరు ట్యూబ్ (ఫోలీ కాథెటర్)ని ఉపయోగించి గొంతులో ఇరుక్కుపోయిన నాణాలను చాలా సులభంగా ఆ డాక్టర్ బయటకు తీస్తున్నాడు. ఈ పద్ధతిలో డాక్టర్ మనోజ్ చౌదరి ఇప్పటివరకు 105 నాణేలను (Unique way to remove a coin stuck in the throat) పిల్లల గొంతుల నుంచి బయటకు తీశారు. విశేషమేమిటంటే.. ఈ పద్ధతిని ఏ పుస్తకంలోనూ రాయలేదు. వైద్యశాస్త్రంలో బోధించలేదు.

ఛతర్పూర్‌లోని అంగౌర్ గ్రామానికి చెందిన 3 ఏళ్ల సైనా నాలుగు రోజుల క్రితం 5 రూపాయల నాణెం మింగేసింది. అది ఆ బాలిక గొంతులో ఇరుక్కుపోయింది. రెండు రోజులుగా నాణెం ఆమె గొంతులో ఉండిపోయింది. ఆ బాలికను డాక్టర్ మనోజ్ దగ్గరకు తీసుకెళ్లారు. డాక్టర్ మొదట ఆ బాలికకు ఎక్స్-రే చేశారు. ఆ ఎక్స్-రే ఆధారంగా ఆపరేషన్ లేకుండా కేవలం 7 నిమిషాల్లో నాణెం బయటకు తీశారు. పాప చాలా సురక్షితంగా ఉంది. ఆ నాణాన్ని ఎలా బయటకు తీశారో డాక్టర్ మనోజ్ కుమార్ వివరించారు.

అన్నింటి కంటే ముందుగా గొంతులో నాణెం ఏ స్థితిలో, ఏ దిశలో ఉందో ఎక్స్-రే ద్వారా తెలుసుకుంటాను. ఆ తర్వాత ఒక చిన్న రబ్బరు ట్యూబ్ (ఫోలీస్ కాథెటర్)ను గొంతులోకి పంపిస్తాను. ఆ పైపు గొంతులో ఉన్న నాణెం దగ్గరకు వెళ్లిన తర్వాత, 10ml సిరంజి ఉపయోగించి ట్యూబులో గాలిని నింపుతాను. అప్పుడు లోపల ఉన్న ట్యూబ్ చివర బెలూన్ లాగా ఉబ్బుతుంది. ఆ తర్వాత నేను ట్యూబ్‌ని మెల్లగా పైకి లాగుతాను. అప్పుడు నాణెం బెలూన్ లాగా ఉబ్బిన ట్యూబ్‌లోకి వచ్చేస్తుందని డాక్టర్ చెప్పారు. కొన్ని ప్రైవేటు ఆసుపత్రుల్లో గొంతులో ఇరుక్కున్న నాణేన్ని బయటకు తీసేందుకు ఎండోస్కోపీ చేస్తారు. ఈ పద్ధతిలో అనస్థీసియా కూడా అవసరం లేదని మనోజ్ తెలిపారు.

హెచ్చరిక: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. ఈ పద్ధతిలో గొంతు నుంచి నాణేన్ని తీయడానికి స్వయంగా ప్రయత్నించవద్దు. ఇది పిల్లల ప్రాణాలను ప్రమాదంలో పడేస్తుంది. పిల్లల గొంతులో నాణెం ఇరుక్కుపోతే వెంటనే వైద్యుడిని సంప్రదించండి.

Updated Date - 2022-12-19T15:26:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising