ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Instagram friendship: ఇన్‌స్టాగ్రామ్‌లో ఖాతా తెరిచిన పైలట్.. ఏకంగా 30మంది మహిళలతో.. చివరకు తెలిసింది ఏంటంటే..

ABN, First Publish Date - 2022-08-04T23:39:23+05:30

ఓ పైలట్ (pilot) ఇన్‌స్టాగ్రామ్‌లో (Instagram) ఖాతా ఓపెన్ చేశాడు. రోజూ మంచి మంచి ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తుండేవాడు. ఈ క్రమంలో సుమారు 150మంది యువతులు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఓ పైలట్ (pilot) ఇన్‌స్టాగ్రామ్‌లో (Instagram) ఖాతా ఓపెన్ చేశాడు. రోజూ మంచి మంచి ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తుండేవాడు. ఈ క్రమంలో సుమారు 150మంది యువతులు, మహిళలకు ఫ్రెండ్ రిక్వెస్ట్‌లు (Friend request) పంపాడు. చివరకు 30మంది మహిళలతో స్నేహం (friendship) చేశాడు. రోజూ వారితో చాటింగ్ చేసేవాడు. క్రమక్రమంగా యువతుల నమ్మకాన్ని క్యాష్ చేసుకున్నాడు. చివరకు మోసపోయామని తెలుసుకున్న యువతులు.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి విచారణలో షాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..


దేశ రాజధాని ఢిల్లీ (Delhi) పరిధిలోని గురుగ్రామ్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. 25ఏళ్ల హేమంత్ శర్మ అనే వ్యక్తి  ఇన్‌స్టాగ్రామ్‌లో తాను పైలెట్‌‌నని పేర్కొంటూ ఖాతా తెరిచాడు. రోజూ వియానయానానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తూ ఉండేవాడు. తర్వాత సుమారు 150మంది మహిళలకు ఫ్రెండ్ రిక్వెస్ట్‌లు పంపాడు. వారిలో 30మంది యువతులు ఇతడితో స్నేహం చేసేందుకు ముందుకొచ్చారు. వారితో రోజూ చాటింగ్ చేస్తూ బాగా దగ్గరయ్యాడు. ఈ క్రమంలో వివిధ సాకులు చెబుతూ వారి నుంచి వేలు, లక్షల రూపాయల్లో డబ్బులను అన అకౌంట్‌కు బదిలీ చేయించుకున్నాడు.

Tragedy news: విధి వక్రించడం అంటే ఇదేనేమో.. అప్పటిదాకా బాగున్న వ్యక్తి.. ఉన్నట్టుండి ఉడుకుతున్న గంజిలో పడి..


డబ్బులు ఇచ్చిన వారికి అందుబాటులో లేకుండా ఉండేవాడు. ఇటీవల ఓ బాధితురాలు అతడికి ఏకంగా లక్ష రూపాయలను బదిలీ చేసింది. అయితే తర్వాత అతను అందుబాటులో లేకపోవడంతో అనుమానం వచ్చి, పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేయగా.. షాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చాయి. అసలు ఆ వ్యక్తి పైలటే కాదని తేలింది. మహిళలను ఆకట్టుకునేందుకు ఫేక్ ఫ్రొపైల్ క్రియేట్ చేశాడని, తాను పైలట్‌నని నమ్మించేందుకు ఎయిర్‌లైన్ సిబ్బందితో స్నేహం చేసేవాడని తెలిసింది. ప్రస్తుతం పరారీలో ఉన్న నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Bank Cash: బ్యాంక్‌కు వెళ్లిన 12ఏళ్ల బాలుడు.. రూ.35లక్షల బ్యాగుతో తిరిగొచ్చాడు.. చివరకు అధికారులు ఆరాతీయగా..



Updated Date - 2022-08-04T23:39:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising