Bank Cash: బ్యాంక్‌కు వెళ్లిన 12ఏళ్ల బాలుడు.. రూ.35లక్షల బ్యాగుతో తిరిగొచ్చాడు.. చివరకు అధికారులు ఆరాతీయగా..

ABN , First Publish Date - 2022-08-04T22:18:35+05:30 IST

ప్రస్తుత టెక్నాలజీ యుగంలో చిన్న పిల్లలు కూడా వివిధ రకాల నేరాలకు పాల్పడి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. కొందరు ఆన్‌లైన్‌లో మోసానికి గురవుతుంటే.. మరికొందరు పిల్లలు..

Bank Cash: బ్యాంక్‌కు వెళ్లిన 12ఏళ్ల బాలుడు.. రూ.35లక్షల బ్యాగుతో తిరిగొచ్చాడు.. చివరకు అధికారులు ఆరాతీయగా..

ప్రస్తుత టెక్నాలజీ యుగంలో చిన్న పిల్లలు కూడా వివిధ రకాల నేరాలకు పాల్పడి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. కొందరు ఆన్‌లైన్‌లో మోసానికి గురవుతుంటే.. మరికొందరు పిల్లలు అదే ఆన్‌లైన్ వేదికగా నేరాలకు పాల్పడుతున్నారు. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయకే బాలుడు.. ఇందుకు పూర్తి విరుద్ధం. అమాయకుడిలా బ్యాంకులోకి వెళ్లిన బాలుడు.. వస్తూ వస్తూ రూ.35లక్షల బ్యాగును పట్టుకొచ్చాడు. కాసేపటి తర్వాత సీసీ టీవీ ఫుటేజీని పరిశీలించిన అధికారులు నోరెళ్లబెట్టారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.


పంజాబ్ (Punjab) రాష్టం పాటియాలా షెరన్‌వాలా గేట్‌లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (State Bank of India) ప్రధాన కార్యాలయం వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. ఆ సమయంలో ఖాతాదారులతో బ్యాంకు రద్దీగా ఉంది. ఎవరి పనుల్లో వారు నిమగ్నమై ఉన్నారు. అదే సమయంలో ఓ 12ఏళ్ల బాలుడు బ్యాంకు లోపలికి వచ్చాడు. కాసేపు అటూ ఇటూ కలియతిరిగాడు. ఆ సమయంలో ఏటీఎంలో డబ్బు (ATM cash) నింపేందుకు సెక్యూరిటీ సిబ్బంది నగదుతో నిండిన బ్యాగుతో సిద్ధంగా ఉన్నారు. వారిని చాలా సేపటి నుంచి ఆ బాలుడు గమనిస్తూ ఉన్నాడు.

Innovative Stunt: కారు నుంచి బుల్లెట్‌లా దూసుకొచ్చిన ఇతడి స్టంట్ చూస్తే.. షాకవకుండా ఉండలేరు..


బ్యాంకు సిబ్బంది ఏమరపాటులో ఉండగా.. ఇదే మంచి సమయం అనుకుని రూ.35లక్షల నగదు ఉన్న బ్యాగును తీసుకుని అక్కడి నుంచి చల్లగా జారుకున్నాడు. నగదు కనిపించకపోవడంతో అక్కడ ఒక్కసారిగా గందరగోళ వాతావరణం ఏర్పడింది. చివరకు అధికారులు సీసీ టీవీ ఫుటేజీని పరిశీలించారు. బ్యాగును తీసుకెళ్తున్న బాలుడిని చూసి అంతా షాక్ అయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి, బాలుడి కోసం గాలిస్తున్నారు. మొత్తానికి ఈ వార్త స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది.

Tragedy news: విధి వక్రించడం అంటే ఇదేనేమో.. అప్పటిదాకా బాగున్న వ్యక్తి.. ఉన్నట్టుండి ఉడుకుతున్న గంజిలో పడి..





Updated Date - 2022-08-04T22:18:35+05:30 IST