ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాత్రి 11గంటలకు బయటకు వెళ్లిన బాలిక.. ఉదయం 5గంటలకు ప్రత్యక్షం.. రాత్రంతా ఎక్కడికెళ్లావని ప్రశ్నించగా..

ABN, First Publish Date - 2022-08-21T00:01:54+05:30

బాలికలు, యువతులు, మహిళలు.. వయసుతో నిమిత్తం లేకుండా ప్రతి ఒక్కరూ.. ఎక్కడో చోట, ఏదో ఒక సందర్భంలో వేధింపులకు గురవుతూనే ఉన్నారు. ప్రేమ పేరుతో కొందరు..

ప్రతీకాత్మక చిత్రం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బాలికలు, యువతులు, మహిళలు.. వయసుతో నిమిత్తం లేకుండా ప్రతి ఒక్కరూ.. ఎక్కడో చోట, ఏదో ఒక సందర్భంలో వేధింపులకు గురవుతూనే ఉన్నారు. ప్రేమ పేరుతో కొందరు మోసపోతుంటే.. అదే ప్రేమను తిరస్కరించినందుకు మరికొందరు.. దాడులకు గురవుతున్నారు. ఇటీవల ఇలాంటి దారుణాలు తరచూ చోటు చేసుకుంటున్నాయి. తాజాగా హర్యానాలో ఇలాంటి ఘటనే జరిగింది. రాత్రి 11గంలకు బయటకు వెళ్లిన బాలిక.. ఉదయం 5గంటలకు ప్రత్యక్షమైంది. ఇంతసేపు ఎక్కడికెళ్లావని కుటుంబ సభ్యులు ప్రశ్నించగా.. షాకింగ్ వాస్తవం వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే..


హర్యానా (Haryana) రాష్ట్రం ఝజ్జర్ జిల్లా పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక ప్రాంతానికి చెందిన దంపతులు.. కుమార్తెతో కలిసి నివాసం ఉంటున్నారు. సంతోషంగా సాగుతున్న వీరి కుటుంబంలో ఉన్నట్టుండి అనూహ్య ఘటన చోటు చేసుకుంది. అదే గ్రామానికి చెందిన ముగ్గురు వ్యక్తులు.. బాలికను రోజూ గమనించేవారు. ఇటీవల ఓ రోజు రాత్రి 11గంటల సమయంలో బాలిక ఇంటి బయటకు వెళ్లింది. అదే సమయంలో అక్కడే ఉన్న ముగ్గురూ కలిసి ఆమెను ఎత్తుకెళ్లారు. రాత్రంతా బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు. బయట ఎవరికైనా చెబితే చంపేస్తామని బెదిరించారు.

పెళ్లయిన మహిళతో ప్రేమ.. బైకులో ఎక్కించుకుని వెళ్తూ... స్నేహితుడికి ఫోన్ చేసిన తర్వాత వారు చేసిన పని..


అనంతరం వేకువజాము 5గంటలకు ఆమెను ఇంటి వద్ద వదిలి వెళ్లిపోయారు. అప్పటికే కూతురు కోసం కంగారుగా ఎదురు చూస్తున్న తల్లిదండ్రులు.. ఎక్కడికెళ్లావంటూ ప్రశ్నించారు. దీంతో బాలిక ఏడుస్తూ జరిగిన విషయం తెలియజేసింది. వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. బాలికను వైద్య పరీక్షల (Medical tests) నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అత్యాచారం జరిగినట్లు నిర్ధారణ అవడంతో గ్రామంలో ఉన్న ముగ్గురు నిందితులనూ అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ఒకరు మైనర్ అని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Facebook post: ప్రియురాలితో దిగిన ఫొటోను ఫేస్‌బుక్‌లో షేర్ చేసిన యువకుడు.. మరుసటి రోజే ఇలా జరుగుతుందని ఊహించలేకపోయాడు..



Updated Date - 2022-08-21T00:01:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising