Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement
Published: Fri, 19 Aug 2022 18:37:26 IST

Facebook post: ప్రియురాలితో దిగిన ఫొటోను ఫేస్‌బుక్‌లో షేర్ చేసిన యువకుడు.. మరుసటి రోజే ఇలా జరుగుతుందని ఊహించలేకపోయాడు..

twitter-iconwatsapp-iconfb-icon
Facebook post: ప్రియురాలితో దిగిన ఫొటోను ఫేస్‌బుక్‌లో షేర్ చేసిన యువకుడు.. మరుసటి రోజే ఇలా జరుగుతుందని ఊహించలేకపోయాడు..

వారిద్దరిదీ ఒకే ఊరు. కొన్నాళ్లుగా ఇద్దరూ ప్రేమించుకుంటున్నారు. ఈ క్రమంలో ఆమెతో ఫొటోలు, వీడియోలు తీసుకున్నాడు. ఇటీవల ప్రియురాలితో దిగిన ఫొటోను ఫేస్‌బుక్‌లో షేర్ చేశాడు. అయితే ఇదే అతడి పాలిట మృత్యుపాశంగా మారుతుందని అతను ఊహించలేకపోయాడు. మరుసటి రోజు జరిగిన అనూహ్య ఘటనతో గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి. వివరాల్లోకి వెళితే..

బీహార్ (Bihar) రాష్ట్రం చాప్రా జిల్లా డెర్ని పరిధి.. పతర బిన్ టోలి పరిధికి చెందిన లహ్వర్ కుమార్‌కు అదే గ్రామానికి చెందిన ఓ యువతితో చిన్నప్పటి నుంచి స్నేహం ఉంది. ఎదురెదురు ఇళ్లు కావడంతో ఇద్దరి మధ్య ఇటీవల ప్రేమ వ్యవహారం (love affair) నడిచింది. ఇంట్లోని వారికి తెలీకుండా కలుసుకునేవారు. ఈ క్రమంలో ఆమెతో ఫొటోలు, వీడియోలు తీసుకున్నాడు. అయితే ఇటీవల ప్రియురాలితో దిగిన ఫేస్‌బుక్‌లో షేర్ (Facebook post) చేశాడు. దీంతో వారి ప్రేమ విషయం గ్రామం మొత్తం తెలిసిపోయింది. గురువారం రాత్రి మల విసర్జనకు వెళ్లిన లహ్వర్ కుమార్.. తిరిగి ఇంటికి రాలేదు.

Attack on girl: ఆలయం నుంచి వస్తున్న బాలిక వెనుకే వెళ్లాడు.. మర్కెట్ దగ్గరికి రాగానే వెనుక వైపు నుంచి ఒక్కసారిగా..

అర్ధరాత్రి అవుతున్నా ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు కంగారుపడ్డారు. ఊరంతా వెతికినా ఆచూకీ లభించలేదు. గ్రామ సమీపంలోని నదిలో చేపల వేట కోసం జాలర్లు వలను ఏర్పాటు చేశారు. శుక్రవారం ఉదయం అందులో చేపల వలలో మృతదేహం లభ్యమైంది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఇదిలావుండగా, అదే రోజు రాత్రి లహ్వర్ కుమార్‌ ప్రియురాలి కుటుంబ సభ్యులు.. ఇంటికి తాళం వేసి వెళ్లిపోయారు. దీంతో వారే యువకుడిని హత్య చేసి ఉంటారని మృతుడి కుటుంబ సభ్యులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. వివిధ కోణాల్లో కేసు దర్యాప్తు చేస్తున్నారు.

ఆరు నెలల క్రితం అస్వస్థతకు గురైన భర్త.. ఇటీవల చెల్లెలి ఇంటికి వెళ్తున్నానని చెప్పిన భార్య.. చివరకు చేసిన పని..


ఇవి కూడా చదవండిLatest News in Telugu

Wife Killed Husband: భర్తను చంపి బాత్రూంలోనే మృతదేహాన్ని రెండ్రోజుల పాటు దాచిన భార్య.. వాసన వస్తోందని ఆమె చేసిన పనితో..గ్రామం ఖాళీ చేసిన యువకుడి కుటుంబం.. విషయం తెలిసి వీడియో రిలీజ్ చేసిన యువతి.. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..పిల్లలను ఇంట్లో వదిలి అర్ధరాత్రి అత్తగారింటికి వెళ్లి.. చివరకు భార్య గదిలో అతడు చేసిన దారుణం..అతడికి అప్పుడప్పుడూ పెళ్లిళ్లు చేసుకోవడం అలవాటు.. భర్త మానసిక స్థితి గురించి మొదటి భార్య చెప్పింది విని అంతా షాక్..Honor Killing: కన్న కూతురిని చంపి నడిరోడ్డుపై పారేసిన తండ్రి.. శవం ఎవరిదో గుర్తు పట్టకూడదని తలను నరికి..Monkey video: నాకు నచ్చింది నాకే దక్కాలన్న కోతి.. నేనూ తగ్గనన్న యువతి.. చివరకు ఏమైందంటే.. video
Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

ప్రత్యేకంLatest News in Teluguమరిన్ని...

Advertisement
OpinionPoll
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.