ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

DOG Death Anniversary: కుక్కకు గుడి కట్టిన యజమాని.. ఈ ప్రేమ మామూలుగా లేదుగా..

ABN, First Publish Date - 2022-07-24T01:16:16+05:30

ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది జంతు ప్రేమికులు ఉన్నారు. ఇంట్లో పెంపుడు జంతువులను పెంచుకుంటూ వాటిని ఎంతో అపరూపంగా చూసుకుంటారు. ముఖ్యంగా శునకాల (dogs) పై..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది జంతు ప్రేమికులు ఉన్నారు. ఇంట్లో పెంపుడు జంతువులను పెంచుకుంటూ వాటిని ఎంతో అపరూపంగా చూసుకుంటారు. ముఖ్యంగా శునకాల (dogs) పై ఎక్కువగా ప్రేమను పెంచుకుంటారు. వాటిని తమ కుటుంబంలో ఒకరిలా భావిస్తారు. అంత ప్రేమగా చూసుకునే శునకం చనిపోతే.. మనుషులే చనిపోయినంతగా బాధపడతారు. కృష్ణా జిల్లాలో ఓ వ్యక్తి తన పెంపుడు కుక్కపై ఇలాంటి ప్రేమే పెంచుకున్నాడు. వివరాల్లోకి వెళితే..


కృష్ణా జిల్లా బాపులపాడు మండలం అంపాపురంకి చెందిన జ్ఞాన ప్రకాశ్‌ రావు తొమ్మిదేళ్ల క్రితం ఓ శునకాన్ని కొనుగోలు చేశాడు. అప్పటి నుంచి దానిని సొంత కొడుకులా పెంచాడు. ఉన్న ఇద్దరు కూతుళ్లకు పెళ్లిళ్లు చేసి, అత్తారింటికి పంపించడంతో జ్ఞాన ప్రకాశ్‌ రావు దంపతులు ఒంటరిగా మిగిలారు. ఈ క్రమంలో వారు ఆ కుక్కను జాగ్రత్తగా చూసుకునేవారు. ఆ కుక్క రోజూ యజమాని వెంటే పొలం దగ్గరికి వెళ్లి కాపలా ఉండేది.

KERALA FISHER MAN: చేపల వలలో వింత వస్తువు.. విలువ 28 కోట్లు..!


ఒక్కక్షణం కూడా యజమానిని విడిచిపెట్టి ఉండేది కాదు. ప్రకాశ్‌రావు ఏదైనా పనిమీద ఊరేళితే.. ఆయన వచ్చే వరకు కనీసం ఆహారం కూడా తినేది కాదు. అలాంటి శునకం ఆరేళ్ల క్రితం మరణించింది. దీంతో అప్పటి నుంచి మనుషులకు జరిపినట్లు కర్మకాండలు నిర్వహిస్తున్నారు. 200 మందికి పైగా బంధువులు, గ్రామస్తులను పిలిచి భోజనాలు పెట్టారు. గత ఏడాది 5వ వర్ధంతిన ఇంటి ముందు ఆ శునకం విగ్రహం ఏర్పాటు చేసి.. మూగ జీవాలపై తమకున్న ప్రేమను చాటుకున్నారు జ్ఞాన ప్రకాశ్‌ రావు దంపతులు.

Arpita Mukherjee Background: ఎవరీ అర్పితా ముఖర్జీ.. ఆమె ఇంట్లోకి రూ.20 కోట్ల నోట్ల కుప్పలు ఎలా వచ్చాయ్..?



Updated Date - 2022-07-24T01:16:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising