Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement
Published: Sat, 23 Jul 2022 18:44:50 IST

Arpita Mukherjee Background: ఎవరీ అర్పితా ముఖర్జీ.. ఆమె ఇంట్లోకి రూ.20 కోట్ల నోట్ల కుప్పలు ఎలా వచ్చాయ్..?

twitter-iconwatsapp-iconfb-icon
Arpita Mukherjee Background: ఎవరీ అర్పితా ముఖర్జీ.. ఆమె ఇంట్లోకి రూ.20 కోట్ల నోట్ల కుప్పలు ఎలా వచ్చాయ్..?

టీఎంసీ నేత, పశ్చిమ బెంగాల్ మంత్రి పార్థ ఛటర్జీ (Partha Chatterjee) సన్నిహితురాలు అర్పిత ముఖర్జీ (Arpita Mukherjee) నివాసంలో శుక్రవారం రాత్రి ఈడీ (Enforcement Directorate) అధికారులు సోదాలు నిర్వహించి,  రూ.20 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ కేసులో అర్పిత ముఖర్జీని శనివారం ఈడీ అధికారులు అదులోకి తీసుకుని విచారిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలల్లో ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది నియామకాల్లో కుంభకోణం జరిగినట్లుగా కేసు నమోదైంది. ‘‘ అసలు ఎవరీ అర్పిత ముఖర్జీ, ఈమె బ్యాక్‌గ్రౌండ్ (Background) ఏంటీ, ఆమెకు, పార్థ ఛటర్జీకి పరిచయం ఎలా ఏర్పడింది’’.. ప్రస్తుతం దేశంలో ఎక్కడ చూసినా ఇలాంటి అనుమానాలే వ్యక్తమవుతున్నాయి. ఇంతకీ అర్పితా ముఖర్జీకి సంబంధించిన వివరాల్లోకి వెళితే..

Arpita Mukherjee Background: ఎవరీ అర్పితా ముఖర్జీ.. ఆమె ఇంట్లోకి రూ.20 కోట్ల నోట్ల కుప్పలు ఎలా వచ్చాయ్..?

మంత్రి పార్థ ఛటర్జీకి అర్పిత ముఖర్జీ అత్యంత సన్నిహితురాలు అని మాత్రమే ఇంతవరకు తెలుసు. కానీ ఆమె గతంలో చాలా చిత్రాల్లో వివిధ పాత్రలు పోషించిన విషయం చాలా మందికి తెలీదు. 2008, 2009 సమయంలో బెంగాలీ సూపర్ స్టార్లు అయిన ప్రోసెన్‌జిత్, జీత్‌కు చెందిన ‘మామా భాగ్నే’, ‘పార్ట్‌నర్’ అనే చిత్రాల్లో అర్పిత ముఖర్జీ సైడ్ రోల్స్‌లో నటించింది. అలాగే తమిళ, ఒడియా చిత్రాల్లో వివిధ పాత్రల్లో నటించడంతో ముఖర్జీ పేరు అందరికీ సుపరిచితమైంది. సినీ ఇండస్త్రీలో తక్కువ కాలం ఉన్నా మంచి పేరు సంపాదించింది.

Arpita Mukherjee Background: ఎవరీ అర్పితా ముఖర్జీ.. ఆమె ఇంట్లోకి రూ.20 కోట్ల నోట్ల కుప్పలు ఎలా వచ్చాయ్..?

అనంతరం 2019, 2020 మధ్య కాలంలో పార్థా ఛటర్జీ ఆధ్వర్యంలో నిర్వహించే దుర్గా పూజల కమిటీ ‘నాట్కల ఉదయన్ సంఘ’కి ప్రచారకర్తగా వ్యవహరించింది. కోల్‌కతాలోని అతిపెద్ద దుర్గా పూజ కమిటీలలో ఇది ఒకటి. కమిటీ ఆధ్వర్యంలో తరచూ క్యాంపెయిన్‌లు నిర్వహించేవారు. దుర్గాపూజ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్‌లో పార్థ ఛటర్జీ పేరు సంఘ్ అధ్యక్షుడు అని రాశారు. ఈ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఓ కార్యక్రమానికి ముఖ్యమంత్రి మమతా బెనర్జీ హాజరైన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దుర్గాపూజల కమిటీకి సంబంధించిన కార్యక్రమాల సందర్భంగా అర్పిత ముఖర్జీకి మంత్రితో పరిచయం ఏర్పడింది.

Arpita Mukherjee Background: ఎవరీ అర్పితా ముఖర్జీ.. ఆమె ఇంట్లోకి రూ.20 కోట్ల నోట్ల కుప్పలు ఎలా వచ్చాయ్..?

కమిటీ పనుల్లోనే కాకుండా తృణమూల్ కాంగ్రెస్ (Trinamool Congress) నిర్వహించే కార్యక్రమాల్లోనూ చురుగ్గా వ్యవహరించడంతో వారి మధ్య సాన్నిహిత్యం మరింత బలపడిందని తెలుస్తోంది.  కాగా, ఈడీ సోదాల్లో ఇరవైకి పైగా మొబైల్ ఫోన్స్ స్వాధీనం చేసుకున్నారు. నటి అర్పిత ముఖర్జీతో పాటు విద్యాశాఖ మంత్రి పరేష్ అధికారే, ఎమ్మెల్యే మాణిక్ భట్టాచార్య తదితరుల ఇళ్లలోనూ ఈడీ దాడులు కొనసాగాయి. మరోవైపు ఈడీ దాడులపై తృణమూల్ కాంగ్రెస్ మండిపడుతోంది. ఇదంతా బీజేపీ కుట్ర అని ఆరోపిస్తోంది. ఈ వివాదం ముందు ముందు మరెన్ని మలుపులు తీసుకుంటుందో వేచి చూడాల్సి ఉంది.

Arpita Mukherjee Background: ఎవరీ అర్పితా ముఖర్జీ.. ఆమె ఇంట్లోకి రూ.20 కోట్ల నోట్ల కుప్పలు ఎలా వచ్చాయ్..?ఇవి కూడా చదవండిLatest News in Telugu

1433 Kilometers ప్రయాణించి భర్తను చేరుకున్న మహిళ.. ఇంటి ఎదుట ఏడు రోజులుగా కేవలం నీళ్లు తాగుతూ.. చివరకు రిక్షా డ్రైవర్ గమనించడంతో..Viral Video: స్కూబా డైవింగ్ చేస్తుండగా.. సముద్రం అడుగున అనూహ్య ఘటన.. వారి టైం బాగుండి సరిపోయింది...videoRoyal Enfield Bike కంటే ఈ మామిడి పండ్ల ధరే ఎక్కువ.. ఒక్క కిలో ఎన్ని లక్షల రూపాయలంటే..చనిపోయిందా..? చంపేశారా..? మిస్టరీగా మారిన మహిళ సజీవ దహనం కేసు.. తెల్లవారుజామున 3 గంటల సమయంలో..నేరుగా స్టేషన్‌కు వచ్చి.. వెక్కి వెక్కి ఏడుస్తూ 15 ఏళ్ల బాలిక చెప్పింది విని నివ్వెరపోయిన పోలీసులు.. ఇంటికి వెళ్లి చూస్తే..Viral Video: పెళ్లిలో ఫ్రెండ్స్ ఇచ్చిన గిఫ్ట్‌ను ఓపెన్ చేసి చూసి.. సిగ్గుతో ఎవరికీ కనిపించకుండా దాచిన వరుడు.. వధువు రియాక్షన్ చూస్తే..video
Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

ప్రత్యేకంLatest News in Teluguమరిన్ని...

Advertisement
OpinionPoll
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.