ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Shocking case like Bilkis Bano: 217 మంది అమాయకుల ప్రాణాలను తీసేసిన ఈ కిరాతకుడు జైలు నుంచి బయటకు..!?

ABN, First Publish Date - 2022-08-20T21:52:39+05:30

గుజరాత్ (Gujarat) రాష్ట్రంలో 2002లో జరిగిన సామూహిక అత్యాచార ఘటన.. ఎంత సంచలనం కలిగించిందో అందరికీ తెలిసిందే. బిల్కిన్ బానో అనే గర్భిణిపై 11మంది నిందితులు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుజరాత్ (Gujarat) రాష్ట్రంలో 2002లో జరిగిన సామూహిక అత్యాచార ఘటన.. ఎంత సంచలనం కలిగించిందో అందరికీ తెలిసిందే. బిల్కిన్ బానో అనే గర్భిణిపై 11మంది నిందితులు సామూహిక అత్యాచారానికి పాల్పడడంతో పాటూ కుటుంబ సభ్యులను హత్య చేశారు. ఈ ఘటనపై నిందితులకు కోర్టు 2008లో జీవిత ఖైదు విధించింది. అయితే ఈ ఏడాది ఆగస్టు 15న వారిని గుజరాత్ ప్రభుత్వం విడుదల చేసింది. దీనిపై  ప్రస్తుతం బాధితురాలితో పాటూ పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడీ ప్రస్తావన ఎందుకొచ్చిందంటే.. ఇండోనేషియాలో కూడా ఇలాంటి ఉదంతం తెరపైకి వచ్చింది.


ఆగస్టు 17 ఇండోనేషియా (Indonesia) స్వాతంత్ర్య దినోత్సవాన్ని (Independence Day) పురస్కరించుకుని పలువురు ఖైదీలను విడుదల చేస్తుంటారు. ఈ సందర్భంగా ఉమర్ పటేక్ అనే పేరుమోసిన ఉగ్రవాది కూడా త్వరతో విడుదల కానున్నాడు. దీనిపై ఆస్ట్రేలియా (Australia) అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఉమర్ పటేక్.. అల్ ఖైదా-సంబంధిత ఉగ్రవాద సంస్థ జెమాహ్ ఇస్లామియా సభ్యుడిగా ఉన్నాడు. ఇండోనేషియాలోని జకర్తాలో 2000లో క్రిస్మస్ సందర్భంగా పలు చర్చిలపై ఉగ్రవాద సంస్థతో కలిసి బాంబు దాడుల్లో పాల్గొన్నాడు. ఈ ఘటనలో 15 మంది మరణించారు.

పెళ్లయిన మహిళతో ప్రేమ.. బైకులో ఎక్కించుకుని వెళ్తూ... స్నేహితుడికి ఫోన్ చేసిన తర్వాత వారు చేసిన పని..


అలాగే 2002లో బాలిలో జరిగిన బాంబు దాడుల్లో 88 మంది ఆస్ట్రేలియన్లు సహా 202మంది మరణించారు. 2012లో ఇండోనేషియా కోర్టు ఉమర్ పటేక్‌కు 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది. కాగా, స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఉమర్‌ను ఇండోనేషియా ప్రభుత్వం.. విడుదల చేస్తోందని ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్ శుక్రవారం తెలిపారు. ఈ విషయంపై ఇండోనేషియా న్యాయ, మానవ హక్కులు, విదేశాంగ మంత్రిత్వ శాఖ.. తమ ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేదన్నారు. అయితే ఉమర్ పటేక్ విడుదల అంశంపై తమ అభిప్రాయాలను ఇండోనేషియా ప్రభుత్వానికి తెలియజేసినట్లు ఆంథోనీ అల్బనీస్ పేర్కొన్నారు.

Facebook post: ప్రియురాలితో దిగిన ఫొటోను ఫేస్‌బుక్‌లో షేర్ చేసిన యువకుడు.. మరుసటి రోజే ఇలా జరుగుతుందని ఊహించలేకపోయాడు..



Updated Date - 2022-08-20T21:52:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising