ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పిల్లలను ఇంట్లో వదిలి అర్ధరాత్రి అత్తగారింటికి వెళ్లి.. చివరకు భార్య గదిలో అతడు చేసిన దారుణం..

ABN, First Publish Date - 2022-08-19T00:52:15+05:30

భార్యాభర్తల మధ్య సమస్యలనేవి సహజం. కొన్నాళ్లు పోతే అవే సర్దుకుంటాయని కుటుంబ పెద్దలు చెబుతుంటారు. వారు చెప్పినట్లుగానే కొన్నాళ్లకు దంపతులు మళ్లీ కలిసిపోవడం చూస్తూనే...

ప్రతీకాత్మక చిత్రం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భార్యాభర్తల మధ్య సమస్యలనేవి సహజం. కొన్నాళ్లు పోతే అవే సర్దుకుంటాయని కుటుంబ పెద్దలు చెబుతుంటారు. వారు చెప్పినట్లుగానే కొన్నాళ్లకు దంపతులు మళ్లీ కలిసిపోవడం చూస్తూనే ఉంటాం. అయితే కొన్నిసార్లు మాత్రం ఇందుకు విరుద్ధంగా జరుగుతుంటుంది. చిన్న చిన్న సమస్యలను పెద్దవి చేసుకుని, చివరికి విడాకుల వరకూ వెళ్తుంటారు. మరికొన్ని సార్లు ఒకరిమీద ఒకరు కక్ష పెంచుకుని దారుణాలకు తెగబడుతుంటారు. హర్యానా రాష్ట్రంలో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. పిల్లలను ఇంట్లో వదిలి అర్ధరాత్రి అత్తగారింటికి వెళ్లిన భర్త.. చివరకు భార్య గదిలో దారుణానికి పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళితే..


హర్యానా (Haryana) రాష్ట్రం ధైజ్ ప్రాంత పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఉత్తరప్రదేశ్‌లోని (Uttar Pradesh) గౌతమ్‌బుద్ నగర్ జిల్లా ఖగోడా గ్రామానికి చెందిన ఫరూక్ అనే వ్యక్తి.. ధైజ్ పరిధి  ఇందిరా కాలనీ ప్రాంతానికి చెందిన యువతితో 13ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి ప్రస్తుతం ముగ్గురు పిల్లలు ఉన్నారు. అయితే నాలుగేళ్లుగా భార్యాభర్తల మధ్య సమస్యలు (Differences between husband and wife) తలెత్తాయి. దీంతో ఇంట్లో రోజూ గొడవలు జరుగుతుండేవి. ఇటీవల ఈ గొడవలు తారాస్థాయికి చేరుకున్నాయి. దీంతో రెండు నెలల క్రితం ఫరూక్ భార్య తన పుట్టింటికి వచ్చింది. దీంతో పలుమార్లు భార్యను తీసుకురావడానికి వెళ్లినా.. ఆమె తల్లిదండ్రులు పంపించలేదు.

అతడికి అప్పుడప్పుడూ పెళ్లిళ్లు చేసుకోవడం అలవాటు.. భర్త మానసిక స్థితి గురించి మొదటి భార్య చెప్పింది విని అంతా షాక్..


ఇటీవల ఓ రోజు భార్యను తీసుకొచ్చేందుకు మళ్లీ అత్తగారింటికి వెళ్లాడు. అయితే ఆమె మాత్రం రానని తేల్చిచెప్పింది. దీంతో తన పిల్లలను బలవంతంగా తీసుకుని సొంతూరుకు వచ్చాడు. వారిని ఇంట్లో వదిలి శనివారం అర్ధరాత్రి అత్తగారింటికి వెళ్లాడు. గదిలో భార్య ఒక్కటే నిద్రపోతుండడం చూసి.. కత్తితో ఒక్కసారిగా దాడికి తెగబడ్డాడు. భార్య గొంతు కోసి అక్కడి నుంచి పరారయ్యాడు. ఉన్నట్టుండి కూతురిని రక్తపు మడుగులో విగతజీవిగా చూసిన కుటుంబ సభ్యులు బోరున విలపించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుడిని ఆదివారం అరెస్ట్ చేశారు. సోమవారం కోర్టులో హాజరుపరచిన అనంతరం రిమాండ్‌కు తరలించారు.

భర్త తాంత్రికుడు కావడంతో తలుపులు వేసి.. పూజలు చేస్తున్నాడేమో అనుకుంది.. అయితే ఉన్నట్టుండి యువతి గొంతు వినిపించడంతో..



Updated Date - 2022-08-19T00:52:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising