ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Atrocity on girlfriend: రాత్రి వేళ ఇంట్లోకి వచ్చిన ప్రియుడు, అతడి స్నేహితుడు.. కాసేపటికి యువతి కాళ్లు, చేతులు కట్టేసి మరీ..

ABN, First Publish Date - 2022-08-10T01:30:23+05:30

ఆమె తండ్రి ఆరేళ్ల క్రితం మృతి చెందాడు. ఈ క్రమంలో రెండేళ్ల క్రితం ఓ యువకుడితో పరిచయం ఏర్పడింది. ఇద్దరూ సహజీవనం (Live in relationship) చేశారు. ఈ క్రమంలో వారికి కూతురు..

ప్రతీకాత్మక చిత్రం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆమె తండ్రి ఆరేళ్ల క్రితం మృతి చెందాడు. ఈ క్రమంలో రెండేళ్ల క్రితం ఓ యువకుడితో పరిచయం ఏర్పడింది. ఇద్దరూ సహజీవనం (Live in relationship) చేశారు. ఈ క్రమంలో వారికి కూతురు కూడా పుట్టింది. సంతోషంగా సాగుతున్న వీరి కుటుంబంలో అనుకోని విధంగా సమస్యలు తలెత్తాయి. ప్రియురాలిని వేధించడమే కాకుండా స్నేహితుడిని కూడా ఇంటికి తీసుకెళ్లాడు. యువతి చేతులు, కాళ్లు కట్టేసి.. ఇద్దరూ కలిసి చివరకు దారుణానికి పాల్పడ్డారు. తీవ్ర సంచలనం కలిగించిన ఈ ఘటన వివరాల్లోకి వెళితే.. 


హర్యానా (Haryana) రాష్ట్రం ఫతేహాబాద్‌ పరిధికి చెందిన యువతి తండ్రి ఆరేళ్ల క్రితం చనిపోయాడు. ఈ క్రమంలో ఆమెకు రెండేళ్ల క్రితం నరేంద్ర అనే యువకుడు పరిచయమయ్యాడు. ఈ పరిచయం కాస్తా.. కొన్నాళ్లకు ప్రేమగా మారింది. 2020 మార్చి నుంచి ఇద్దరూ సహజీవనం చేస్తున్నారు. 2021లో వారికి కూతురు కూడా పుట్టింది. అయితే ఇటీవల భార్యను.. భర్తతో పాటూ అత్తమామలు కూడా వేధించడం మొదలెట్టారు. సురేంద్ర రోజూ రాత్రిళ్లు భార్యను చిత్రహింసలకు గురి చేసేవాడు. ఈ క్రమంలో ఇటీవల ఓ రోజు రాత్రి వేళ స్నేహితుడిని తీసుకుని ఇంటికి వెళ్లాడు.

Dubai jobs scam: దుబాయ్‌లో ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి.. పాకిస్థాన్‌కు పంపించిన ఏజెంట్.. 20ఏళ్ల తర్వాత వృద్ధురాలి పరిస్థితి ఏంటంటే..


అతడితో కలిసి భార్య చేతులు, కాళ్లు కట్టేసి అత్యాచారానికి పాల్పడ్డారు. రోజూ స్నేహితులతో గడపాలని ఒత్తిడి చేసేవాడు. దీనికి ఆమె ఒప్పుకోకపోవడంతో చంపేస్తానని బెదిరించేవాడు. ఈ విషయం అత్తమామలకు తెలిసినా.. కొడుకునే ప్రోత్సహించేవారు. చివరకు ఈ విషయం తెలుసుకున్న యువతి కుటుంబ సభ్యులు ఆమెను ఇంటికి తీసుకెళ్లారు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. పరారీలో ఉన్న సురేంద్ర, అతని స్నేహితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Suspicious Women: ఆటో కోసం వేచి చూస్తున్న మహిళ.. పోలీసులకు అనుమానం వచ్చి.. ఆమె సూట్‌కేస్‌ను తెరచి చూడగా..



Updated Date - 2022-08-10T01:30:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising