Dubai jobs scam: దుబాయ్‌లో ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి.. పాకిస్థాన్‌కు పంపించిన ఏజెంట్.. 20ఏళ్ల తర్వాత వృద్ధురాలి పరిస్థితి ఏంటంటే..

ABN , First Publish Date - 2022-08-09T22:57:22+05:30 IST

ఉద్యోగాల పేరుతో జరిగే మోసాలను తరచూ చూస్తేనే ఉన్నాం. అయినా రోజూ ఎక్కడోచోట ఎవరో ఒకరు మోసపోతూనే ఉంటారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా కొందరు కష్టమైనా, నష్టమైనా..

Dubai jobs scam: దుబాయ్‌లో ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి.. పాకిస్థాన్‌కు పంపించిన ఏజెంట్.. 20ఏళ్ల తర్వాత వృద్ధురాలి పరిస్థితి ఏంటంటే..

ఉద్యోగాల పేరుతో జరిగే మోసాలను తరచూ చూస్తేనే ఉన్నాం. అయినా రోజూ ఎక్కడోచోట ఎవరో ఒకరు మోసపోతూనే ఉంటారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా కొందరు కష్టమైనా, నష్టమైనా కుటుంబ సభ్యులకు దూరంగా ఉంటూ విదేశాల్లో పని చేస్తుంటారు. అయితే ఇటీవల విదేశాలలో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ కొందరు ఏజెంట్లు మోసాలకు పాల్పడడం ఎక్కువైంది. ముంబైకి చెందిన ఓ మహిళకు కూడా ఇలాంటి అనుభవమే ఎదురైంది. ఏజెంట్ చేసిన మోసానికి.. ఆమె 20ఏళ్ల పాటు కన్నబిడ్డలకు దూరంగా ఉండాల్సి వచ్చింది. ప్రస్తుతం వృద్ధురాలి పరిస్థితి ఎలా ఉందంటే.. 


ముంబైకి (Mumbai) చెందిన హమీదా బేగం.. ఆర్థిక ఇబ్బందుల కారణంగా దుబాయ్‌కి (Dubai) వెళ్లి పని చేయాలని నిర్ణయించుకుంది. ఖతర్‌లో పని చేస్తే ఎక్కువ డబ్బులు వస్తాయని ఓ మహిళా ఏజెంట్ చెప్పిన మాటలను నమ్మిన హమీదా.. సుమారు రూ.20 వేలు చెల్లించి పయనమైంది. అయితే ఆమెను అక్కడికి తీసుకెళ్లకుండా పాకిస్థాన్‌కు (Pakistan) అక్రమంగా తరలించారు. అక్కడ ఓ గదిలో బంధించడంతో కుటుంబ సభ్యులతో సంబంధాలు తెగిపోయాయి. 

Viral Video: కదులుతున్న రైలును ఎక్కేందుకు ప్రయత్నించిన తల్లీకొడుకు.. అక్కడే ఉన్న మహిళా కానిస్టేబుల్ గుర్తించడంతో..


అనంతరం కరాచీ నుంచి సింధ్‌ప్రావిన్స్‌లోని హైదరాబాద్‌లో వదిలేయడంతో పోలీసులకు పట్టుబడింది. 3 నెలలు జైలు శిక్ష అనంతరం విడుదలయ్యింది. అయితే తర్వాత విధిలేని పరిస్థితుల్లో భార్య లేని ఓ పాకిస్తానీని పెళ్లి చేసుకుంది. అతడికి అప్పటికే ఒక కొడుకు ఉన్నాడు. మూడేళ్ల క్రితం పాకిస్థానీ భర్త చనిపోవడంతో ప్రస్తుతం ఆమె సవతి కొడుకు వద్దే ఉంటోంది. ఈ 20ఏళ్ల కాలంలో ముంబైలోని కుటుంబ సభ్యులు ఆమె ఆచూకీ కోసం ఎన్నో ప్రయత్నాలు చేశారు. అయినా ఫలితం లేకపోవడంతో చివరకు ఆశలు వదులుకున్నారు. మరోవైపు పిల్లలను చూడాలనే తపనతో పాకిస్థాన్‌లో నరకం అనుభవించింది.

drunk woman: యువకుడితో పాటూ ఫుల్‌గా మందుకొట్టిన మహిళ.. అదే సమయంలో పిల్లలు వీడియో తీయడంతో.. చివరకు..


అయితే ఇటీవల స్థానికంగా ఉండే ఓ య్యూటూబర్ (YouTuber).. హమీదా సమస్యను వివరిస్తూ తీసిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఆ వీడియోను ఖాల్ఫాన్ షేక్ అనే భారతీయ జర్నలిస్ట్ చూసి, విషయాన్ని ఇండియన్ ఎంబసీ అధికారుల (Indian High Commission)  దృష్టికి తీసుకెళ్లారు. దీంతో వారు హమీదా కుటుంబ సభ్యులకు సమాచారం చేరవేశారు. ఎట్టకేలకు హమీదా.. 20ఏళ్ల తర్వాత సొంత పిల్లలను వీడియో కాల్ ద్వారా చూసింది. కడుపున పుట్టినవాళ్లను 20 ఏళ్లు చూడకుండా గడిపానని, పిల్లల్ని మనసారా కావలించుకోవాలనిపిస్తోందని హమీదా కన్నీంటిపర్యంతమైంది. ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది.

Marriage funny video: పాపం ఏ పెళ్లికూతురికీ రాని కష్టం వచ్చిందే.. పక్కనున్న వారంతా నవ్వుతుంటే.. చివరకు ఎలాగోలా..



Updated Date - 2022-08-09T22:57:22+05:30 IST