ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Viral news: వెంటబడి మరీ యువతుల కాళ్లు పట్టుకున్న యువకులు.. కరుణించమంటూ వేడుకోలు.. విషయం తెలిసి అంతా నవ్వులే నవ్వులు..

ABN, First Publish Date - 2022-08-27T02:21:18+05:30

రోడ్డు మీద నడిచి వెళ్తున్న యువతులను (young women) కొందరు యువకులు వెంటబడి మరీ కాళ్లు పట్టుకున్నారు. వద్దు వద్దు అని యువతులు వారిస్తున్నా.. కాళ్లు వదల్లేదు. తమను...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రోడ్డు మీద నడిచి వెళ్తున్న యువతులను (young women) కొందరు యువకులు వెంటబడి మరీ కాళ్లు పట్టుకున్నారు. వద్దు వద్దు అని యువతులు వారిస్తున్నా.. కాళ్లు వదల్లేదు. తమను కరుణించేవరకూ కాళ్లు వదలమంటూ వారంతా ప్రాథేయపడ్డారు. నడిరోడ్డుపై జరుగుతున్న ఈ తంతును చూసి స్థానికులు షాక్ అయ్యారు. ప్రేమించాలని వేధిస్తున్నారేమో అని అనుకున్నారు. చివరకు అసలు విషయం తెలుసుకుని అంతా తెగ నవ్వుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు.. సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. వివరాల్లోకి వెళితే..


రాజస్థాన్‌లోని (Rajasthan) భరత్‌పూర్‌ నగరంలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక మహరాణి శ్రీజయ కళాశాలలో స్టూడెంట్స్‌ యూనియన్ ఎలక్షన్స్ (Students Union Elections) జరుగుతున్నాయి. దీంతో ఎలాగైనా గెలవాలనే ఉద్దేశంతో రెండు యూనియన్లు పోటాపోటీగా ప్రచారం (Election campaign) చేస్తున్నాయి. అయితే కొందరు యువకులు వినూత్నంగా ఓట్లు అడగాలని నిర్ణయించుకున్నారు. రోడ్డుపై వెళ్తున్న తోటి విద్యార్థినులను వెంటబడి మరీ కాళ్లు పట్టుకున్నారు. తమను కరుణించి, ఓట్లు వేసి గెలిపించాలని కోరుతూ ప్రాథేయపడ్డారు.

మద్యం మత్తులో ఉన్న భర్తకు భోజనం తెచ్చేందుకు బయటికి వెళ్లిన భార్య.. మరుక్షణం అర్ధ నగ్నంగా ప్రత్యక్షం.. ఇంతకీ ఏం జరిగిందంటే..


తమను కరుణించేవరకూ కాళ్లు వదలమని వేడుకున్నారు. ఈ క్రమంలో కొందరు యువతులైతే.. బాగా ఇబ్బంది పడ్డారు. మీకే ఓట్లేస్తాం.. కానీ కాళ్లు పట్టుకోవద్దంటూ పరుగెత్తారు. వీరిని చూసిన స్థానికులు.. యువతులను వేధిస్తున్నారేమో అని ముందు అనుకున్నారు. తర్వాత విషయం తెలుసుకుని పగలబడి నవ్వుకున్నారు. ఈ ఘటనను అక్కడే ఉన్న విద్యార్థులు ఫొటోలు, వీడియోలు తీసి.. సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీనిపై నెటిజన్లు ఫన్నీ ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు.

Transgenders agitation: బ్రాంచ్ మేనేజర్‌ను బయటికి లాగి.. రోడ్డుపై డ్యాన్స్ చేసిన హిజ్రాలు.. మద్దతుగా నిలిచిన స్థానికులు.. ఇంతకీ సమస్య ఏంటంటే..



Updated Date - 2022-08-27T02:21:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising