ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Gadag school viral video: విద్యార్థుల చేత టాయిలెట్లు కడిగించిన టీచర్లు.. కారణమేంటంటే..

ABN, First Publish Date - 2022-07-28T01:32:30+05:30

తెలిసో తెలియకో విద్యార్థులు చేసిన తప్పులను సరిదిద్ది వారిని మంచి మార్గంలో నడిపించాల్సిన గురువులు అత్యంత కర్కశంగా ప్రవర్తించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తెలిసో తెలియకో విద్యార్థులు చేసిన తప్పులను సరిదిద్ది వారిని మంచి మార్గంలో నడిపించాల్సిన గురువులు అత్యంత కర్కశంగా ప్రవర్తించారు. విద్యార్థులను సొంత బిడ్డల్లా చూసుకోవాల్సిన ఉపాధ్యాయులు వారితో టాయిలెట్ల (Toilets) ను కడిగించారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ (Viral Video) అవుతోంది. కర్ణాటక (Karnataka)లోని గడగ్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. పాఠశాల విద్యార్థులు నాగవి పాఠశాలలో టాయిలెట్‌ను శుభ్రం చేస్తున్న వీడియో వైరల్‌గా మారింది. 


ఇది కూడా చదవండి..

Google: పట్టు వదలని విక్రమార్కుడు.. 39 ప్రయత్నాల తర్వాత గూగుల్‌లో జాబ్ సాధించాడు.. వైరల్ అవుతున్న స్టోరీ


పాఠశాలకు సమయానికి రానందుకు శిక్ష(Punishment) గా మరుగుదొడ్లను శుభ్రం చేయాలని ఉపాధ్యాయులు ఆదేశించినట్టు విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఆ ఘటన మొత్తాన్ని ఆ పాఠశాలలో పనిచేసే వంట మనిషి వీడియో తీసింది. `నేను పాఠశాలలో ఉన్నప్పుడు, టాయిలెట్ శుభ్రం చేయడానికి బకెట్, చీపురు కావాలని కొందరు విద్యార్థులు నన్ను అడిగారు. ఎందుకని అడిగితే.. ఉపాధ్యాయులు తమకు పనిష్మెంట్ ఇచ్చారని చెప్పార`ని ఆ వంట మనిషి చెప్పింది. ఈ వీడియో వైరల్ కావడంతో విమర్శలు వెల్లువెత్తాయి. ఈ ఘటనపై విద్యాశాఖ విచారణ జరుపుతోంది. 



Updated Date - 2022-07-28T01:32:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising