Google: పట్టు వదలని విక్రమార్కుడు.. 39 ప్రయత్నాల తర్వాత గూగుల్‌లో జాబ్ సాధించాడు.. వైరల్ అవుతున్న స్టోరీ

ABN , First Publish Date - 2022-07-28T01:16:42+05:30 IST

మనుషుల్లో మూడు రకాలు ఉంటారు.. మొదటి రకం.. ఏదైనా అనుకున్నారంటే సాధించే వరకు పట్టువీడరు.

Google: పట్టు వదలని విక్రమార్కుడు.. 39 ప్రయత్నాల తర్వాత గూగుల్‌లో జాబ్ సాధించాడు.. వైరల్ అవుతున్న స్టోరీ

మనుషుల్లో మూడు రకాలు ఉంటారు.. మొదటి రకం.. ఏదైనా అనుకున్నారంటే సాధించే వరకు పట్టువీడరు. రెండోరకం.. మొదలు పెట్టి మధ్యలోనే వదిలేసేవారు. మూడోరకం.. అసలు ప్రయత్నం కూడా చేయకుండానే ఓటమిని ఒప్పుకుని తప్పుకునేవారు. వీటిల్లో మొదటి కోవకు చెందిన వ్యక్తి టైలర్ కోహెన్ (Tyler Cohen).. తన డ్రీమ్‌ కంపెనీలో ఉద్యోగంలో చేరేందుకు ఎన్నోసార్లు ప్రయత్నించాడు.. ప్రతీసారి విఫలమయ్యాడు.. అయినా తన ప్రయత్నం మానుకోలేదు.. 39 సార్లు ఓటమి పాలై 40 ప్రయత్నంలో విజయం సాధించాడు.. 


ఇది కూడా చదవండి..

MP Salary: లోక్‌సభ, రాజ్యసభ ఎంపీలు సస్పెన్షన్‌కు గురయితే.. ఆ సమయంలో వారికి జీతం ఇస్తారా..?


కాలిఫోర్నియాలోని శాన్ ఫ్రాన్సిస్కో (San Francisco) కు చెందిన టైలర్ కోహెన్ అనే వ్యక్తికి గూగుల్‌ (Google) సంస్థలో ఉద్యోగం చేయాలనేది కల. 2019 ఆగస్టు 25న తొలిసారి గూగుల్ కంపెనీలో ఉద్యోగం కోసం అప్లై చేశాడు. అప్పుడు తిరస్కరణకు గురయ్యాడు. అయినా నిరాశపడకుండా కొంచెం గ్యాప్‌ ఇచ్చి మళ్లీ అప్లై చేశాడు. మళ్లీ అదే ఫలితం. అలా ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 39 సార్లు విఫలమయ్యాడు. అయినా తన ప్రయత్నాలను మానుకోలేదు. తను ఎక్కడ తప్పులు చేస్తున్నాడో తెలుసుకుని సరిదిద్దుకునేవాడు. చివరకు 40వ ప్రయత్నంలో తను అనుకున్నది సాధించాడు. 


తాజాగా గూగుల్‌ టైలర్‌ను ఎంపిక చేసింది. అతడు జాబ్‌కు సెలక్ట్ అయినట్లు మెయిల్ పంపింది. దీంతో టైలర్ కోహెన్‌ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. కోహెన్ తన ఆనందాన్ని వెంటనే సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Updated Date - 2022-07-28T01:16:42+05:30 IST