ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

RIP Internet Explorer: ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్‌కు సమాధి కట్టించిన కొరియా ఇంజనీర్.. వైరల్ అవుతున్న ఫొటో..

ABN, First Publish Date - 2022-06-18T22:48:46+05:30

ఇప్పుడంటే రకరకాల వెబ్ బ్రౌజర్లు అందుబాటులోకి వచ్చాయి కానీ, ఒకప్పుడు ఇంటర్నెట్ ఉపయోగించాలంటే ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్ ఒకటే దిక్కు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇప్పుడంటే రకరకాల వెబ్ బ్రౌజర్లు అందుబాటులోకి వచ్చాయి కానీ, ఒకప్పుడు ఇంటర్నెట్ ఉపయోగించాలంటే ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్ ఒకటే దిక్కు. పాత తరం ఇంటర్నెట్ యూజర్లందరికీ ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్‌ సుపరిచితమే. మైక్రోసాఫ్ట్ కంపెనీ ఈ వెబ్ బ్రౌజర్‌ను విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో పాటు అందించేది. తొలిసారి 1995లో ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్‌ అందుబాటులోకి వచ్చింది. దాదాపు 27 ఏళ్ల పాటు సేవలందించిన ఈ వెబ్ బ్రౌజర్ ఈ నెల 15 నుంచి పూర్తిగా ఆగిపోయింది. ఆదరణ తగ్గడంతో మైక్రోసాఫ్ట్ సంస్థ ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్‌‌ను నిలిపివేసింది. 


ఇది కూడా చదవండి..

23 ఏళ్ల వయసు.. ఇప్పటికే 23 ఉద్యోగాలు.. ఓ యువతి వింత రికార్డు..!


ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్‌‌ను నిలిపివేయడంపై సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. చాలా మంది తమ జ్ఞపకాలను నెమరువేసుకుంటున్నారు. దక్షిణ కొరియాకు చెందిన జంగ్ కి-యంగ్ అనే ఇంజనీర్ ఏకంగా ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్‌‌కు ఓ సమాధి కట్టించాడు. రూ.25 వేలు ఖర్చుపెట్టి తన సోదరుడి రెస్టారెంట్ ముందు ఆ సమాధిని ఏర్పాటు చేశాడు. ఆ సమాధిపై బ్రౌజర్ అందుబాటులోకి వచ్చిన తేదీ, నిలిపివేసిన తేదీని రాయించాడు. ఈ ఫొటో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. 


`ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్‌ ఎన్నో ఏళ్లుగా ఉపయోగపడింది. ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్‌ ఇప్పుడు ఆగిపోవడం నచ్చడం లేదు. కానీ, తప్పనిసరి పరిస్థితి. అందరినీ నవ్వించడానికే అలా సమాధిని ఏర్పాటు చేశాను. అది ప్రపంచవ్యాప్తంగా వైరల్ అవడం ఆశ్చర్యంగా ఉంద`ని జంగ్ అన్నాడు. 


Updated Date - 2022-06-18T22:48:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising