23 ఏళ్ల వయసు.. ఇప్పటికే 23 ఉద్యోగాలు.. ఓ యువతి వింత రికార్డు..!

ABN , First Publish Date - 2022-06-18T22:31:09+05:30 IST

ఆ యువతి వయసు 23 ఏళ్లు.. 16 ఏళ్ల వయసులో తొలి ఉద్యోగంలో జాయిన్ అయిన ఆమె ఈ ఏడేళ్లలో ఏకంగా 23 ఉద్యోగాలు మారింది.

23 ఏళ్ల వయసు.. ఇప్పటికే 23 ఉద్యోగాలు.. ఓ యువతి వింత రికార్డు..!

ఆ యువతి వయసు 23 ఏళ్లు.. 16 ఏళ్ల వయసులో తొలి ఉద్యోగంలో జాయిన్ అయిన ఆమె ఈ ఏడేళ్లలో ఏకంగా 23 ఉద్యోగాలు మారింది.. బహుశా ప్రపంచంలోనే ఈమెది అతి పొడవైన రెజ్యూమ్ అయి ఉంటుందేమో.. ఎన్నో ఉద్యోగాలు చేసిన ఆ యువతి చివరకు స్వంతంగా వ్యాపారం ప్రారంభించింది.. లండన్‌కు చెందిన అనస్తీసియా సెచెట్టో అనే యువతి ఏస్ ఇన్‌ఫ్లుయెన్సర్‌ను స్థాపించి, 23 ఏళ్లు నిండకముందే సీఈవో అయిపోయింది. 


ఇది కూడా చదవండి..

వైరల్ వీడియో షేర్ చేసిన బిజినెస్ మ్యాన్.. దానికి ఆయన చేసిన కామెంట్ మరింత వైరల్..!


16 ఏళ్ల వయసులో అనస్తీసియా బేకర్‌గా ఉద్యోగం ప్రారంభించింది. `నా తొలి ఉద్యోగం నాకు చాలా కష్టంగా అనిపించింది. చాలా గంటలు ఫ్రీజర్‌లో నిలబడవలసి వచ్చేద`ని ఆమె చెప్పింది. ఆ తర్వాత ఆమె డిష్ వాషర్‌గా, వెయిట్రస్, సేల్స్ వర్కర్, పియానో ​​టీచర్, మార్కెట్ సెల్లర్, ఐస్ క్రీం సెల్లర్, రిటైల్ వర్కర్‌, బేబీ సిట్టర్‌గా పనిచేసింది. అంతేకాదు.. సృజనాత్మక రంగాలైన నటన, మోడలింగ్, కంటెంట్ రైటింగ్, ఫొటోగ్రఫీలో కూడా అనుభవం సంపాదించింది. ప్రస్తుతం 23 ఏళ్ల వయసులో స్వయంగా ఓ కంపెనీ స్థాపించి సీఈవో అయిపోయింది.  


`చివరగా ఒక లగ్జరీ హోటల్‌కి క్రియేటివ్ డైరెక్టర్‌గా కూడా పనిచేశాను. అది మంచి ఉద్యోగమే అయినప్పటికీ.. ఎవరి దగ్గర పనిచేయకూడదనే పట్టుదల నాకు ఉండేది. చిన్నప్పటి నుంచి నాది అదే కోరిక. అందుకే ముందుగా వివిధ రంగాల్లో పనిచేసి అనుభవం సంపాదించా. అన్ని రకాల పనులూ చేయడం వల్ల నాకు ఎంతో మేలు జరిగింది. డిష్ వాషర్, వెయిట్రస్‌గా పనిచేసే వారిని కూడా గౌరవంగా చూడాలని నేర్చుకున్నా. lనిజానికి నేను మంచి ఉద్యోగిని కాదు.. అయినా 23 ఉద్యోగాల నుంచి నాకు నేనే బయటకు వచ్చా. ఎవరూ నన్ను తొలగించలేద`ని అనస్తీసియా చెప్పింది. 

 

Updated Date - 2022-06-18T22:31:09+05:30 IST