ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Viral: `చికెన్ కబాబ్, ఫిష్ టిక్కా, చికెన్ కర్రీ, మటన్ బిర్యానీ`.. తండ్రికి కూతురి లిస్ట్.. ఎందుకో తెలిస్తే షాక్!

ABN, First Publish Date - 2022-12-13T16:25:07+05:30

చదువు కోసమో లేదా ఉద్యోగాల కోసమే నగరాలకు వెళ్లి అక్కడి హాస్టల్‌లో ఉండే వారు భోజనం (Hostel Food) విషయంలో తీవ్ర అసంతృప్తికి గురవుతుంటారు. హాస్టల్‌లో పెట్టే భోజనం తినలేక ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్లి అమ్మ చేతి వంట తిందామా అని ఎదురుచూస్తుంటారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చదువు కోసమో లేదా ఉద్యోగాల కోసమే నగరాలకు వెళ్లి అక్కడి హాస్టల్‌లో ఉండే వారు భోజనం (Hostel Food) విషయంలో తీవ్ర అసంతృప్తికి గురవుతుంటారు. హాస్టల్‌లో పెట్టే భోజనం తినలేక ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్లి అమ్మ చేతి వంట తిందామా అని ఎదురుచూస్తుంటారు. ఇంటికి వెళ్లినపుడు ఏమేమి వండాలో చెప్పి చేయించుకుంటారు. తాజాగా ఓ యువతి కూడా అలాంటి పనే చేసింది. ఐదు నెలల తర్వాత హాస్టల్ నుంచి ఇంటికి వెళుతూ తను వచ్చేటప్పటికి ఏమేం కావాలో ఓ జాబితా (Food Menu) తయారు చేసి తండ్రికి పంపించింది.

తన కూతురు పంపించిన జాబితాను ఆ వ్యక్తి ట్విటర్‌లో షేర్ చేశారు. ఐదు నెలల తర్వాత ఈ నెల 16వ తేదీన ఇంటికి వస్తున్న కూతురు పంపించిన భోజనం మెనూ లిస్ట్ అంటూ ఆ ఫొటోను ఆయన ట్విటర్‌లో షేర్ చేశారు. ఆ ఫొటోలో.. చికెన్ కబాబ్, ఫిష్ టిక్కా, చికెన్ కర్రీ, మటన్ బిర్యానీ అంటూ పెద్ద జాబితా రాసి ఉంది. ఆ జాబితా అంతా ఒక్క 16వ తేదీకే అని పేర్కొనడం గమనార్హం. ఈ వైరల్ పోస్ట్‌పై (Viral News) నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. హమ్మయ్యా.. నాలాంటి వాళ్లు చాలా మంది ఉన్నారన్న మాట అని ఓ నెటిజన్ కామెంట్ చేశారు. నా కూతురికి పెళ్లై 8 నెలల కొడుకు కూడా ఉన్నాడు. ఇప్పటికీ ఆమె అత్తింటి నుంచి వచ్చే ముందు నాకు ఇలాంటి లిస్టే పంపుతుందని ఓ తల్లి కామెంట్ చేసింది.

Updated Date - 2022-12-13T16:25:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising