ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

SureshBabu - Allu Aravind: ఈ జనరేషన్‌ మహానటి ఎవరంటే!

ABN, First Publish Date - 2022-12-03T14:05:37+05:30

టాలీవుడ్‌ అగ్ర కథానాయిక సమంతపై సీనియర్‌ నిర్మాత డి.సురేశ్‌బాబు, అల్లు అరవింద్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాజాగా వీరిద్దరూ బాలయ్య హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ‘అన్‌స్టాపబుల్‌-2’ షోకు హాజరయ్యారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

టాలీవుడ్‌ అగ్ర కథానాయిక సమంతపై సీనియర్‌ నిర్మాత డి.సురేశ్‌బాబు(D sureshbabu), అల్లు అరవింద్‌ (Allu aravind)ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాజాగా వీరిద్దరూ బాలయ్య హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ‘అన్‌స్టాపబుల్‌-2’ షోకు హాజరయ్యారు. బాలకృష్ణ అడిగిన ప్రశ్నలకు ఆసక్తికర సమాధానాలిచ్చారు. ‘ఈ జనరేషన్‌లో మహానటి అయ్యే అవకాశమున్న నటి ఎవరు’? అని అడగగా. నిర్మాతలిద్దరూ సమంత పేరే చెప్పారు. అనుకోకుండా ఇద్దరం ఒకే పేరు రాశామని అల్లు అరవింద్‌ ఎగ్జైట్‌ అయ్యాడు. ఒకవేళ మహానటి (Samantha is Future Mahanati)అనిపించుకునే అవకాశం ఉంటే ఇప్పటి బ్యాచ్‌లో సమంతకే ఆ ఛాన్స్‌ ఉందని సురేశ్‌బాబు పేర్కొన్నారు. కథానాయికగా సమంత టాలెంట్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. గ్లామర్‌ పాత్రలకైనా, నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలకైనా న్యాయం చేయగల సత్తా ఉన్న నటి. తాజాగా  ఆమె నటించిన ‘యశోద’ చిత్రం అందుకు నిదర్శనం. అయితే సమంతను మహానటితో పోల్చడం పట్ల ఆమె అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సోషల్‌ మీడియా వేదికగా సమంతకు శుభాకాంక్షలు చెబుతున్నారు. 

 


Updated Date - 2022-12-03T14:05:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising