Home » Samantha
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత, దర్శకుడు రాజ్ పెళ్ళి చేసుకున్నారు. కొంతకాలంగా రిలేషన్‌లో ఉన్న సమంత రాజ్ ఈ ఉదయం వివాహ బంధంతో ఒక్కటయ్యారు.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కె.తారక రామారావు వేసిన పరువునష్టం దావా కేసులో మంత్రి కొండా సురేఖపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని నాంపల్లి కోర్టు ఆదేశించింది. ఫోన్ ట్యాపింగ్, డ్రగ్స్‌తో పాటు నటి సమంత విడాకుల వ్యవహారంలో కేటీఆర్‌పై నిరాధార ఆరోపణలు చేసిన మంత్రి కొండా సురేఖపై చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించింది.
అమెరికాలో అతి పెద్ద తెలుగు సంఘమైన ఉత్తర అమెరికా తెలుగు సంఘం(తానా) ప్రతి రెండేళ్లకోసారి నిర్వహించే మహాసభలకు ఈసారి డెట్రాయిట్ వేదికైంది. జులై 3వ తేదీ నుంచి 5వ తేదీ వరకు డిట్రాయిట్ సబర్బ్ నోవైలో ఉన్న సబర్బన్ కలెక్షన్ షోప్లేస్‌లో తానా 24వ ద్వైవార్షిక మహాసభలు జరుగనున్నాయి.
Samantha SSLC Mark Sheet: సమంత టెన్త్ క్లాస్ మార్క్ లిస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ మార్క్ షీట్ చూస్తే సమంత యాక్టింగ్ లోనే కాదు.. చదువులోనూ క్వీన్ అని అర్థం అయిపోతుంది.
మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు తెలంగాణలో తీవ్ర దుమారాన్ని రేపాయి. కేటీఆర్‌పై ఆరోపణలు చేస్తూ అక్కినేని ఫ్యామిలీని కూడా మంత్రి కొండా సురేఖ ప్రస్తావనకు తీసుకువచ్చారు. హీరోయిన్ల జీవితాలతో ఆడుకోవడం కేటీఆర్ అలవాటు అని ఆరోపించారు. వారికి డ్రగ్స్ అలవాటు చేసింది కేటీఆరే అని, కేటీఆర్‌కు తల్లి అక్క, చెల్లి లేరా? అని ప్రశ్నించారు.
అక్కినేని నాగార్జున, బిగ్ బాస్ షోపై సీపీఐ నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. పరువు లేని వ్యక్తి పరువు నష్టం దావా వేయడం హాస్యాస్పదం అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
తనపైన, తన కుటుంబంపైన అసత్యవ్యాఖ్యలు చేసిన మంత్రి కొండా సురేఖపై రూ.100 కోట్లకు మరో పరువు నష్టం దావా వేసే ప్రక్రియలో ఉన్నట్టు నటుడు అక్కినేని నాగార్జున చెప్పారు.
కుటుంబంపై, నాగచైతన్య-సమంత విడాకుల వ్యవహారంపైన వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మంత్రి కొండా సురేఖపై నటుడు అక్కినేని నాగార్జున పరువు నష్టం దావా వేశారు.
తెలంగాణ అటవీ, దేవాదాయ శాఖల మంత్రి కొండా సురేఖ మరోసారి బాంబు పేల్చారు. టాలీవుడ్ హీరోయిన్ సమంత విషయంలో తాను చేసిన వ్యాఖ్యలు తప్పేనని మంత్రి కొండా సురేఖ స్పష్టం చేశారు. తనకు ఆగ్రహం వచ్చినందుకే వాస్తవాలు మాట్లాడారన్నారు.
మంత్రి కొండా సురేఖ ఆరోపణలపై చిత్ర పరిశ్రమ భగ్గుమంది. ఆమె వ్యాఖ్యలు అక్కినేని కుటుంబ గౌరవానికి, సమంత గౌరవానికి భంగం కలిగించేలా ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘మీ రాజకీయాల్లోకి మమ్మల్ని ఎందుకు లాగుతున్నారంటూ’ పలువురు సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా మంత్రిని ప్రశ్నించారు.