ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పన్నీర్ కర్రీ ఆర్డర్ చేస్తే చికెన్ కర్రీ పంపించారు.. రెస్టారెంట్‌కు రూ.20 వేలు జరిమానా..!

ABN, First Publish Date - 2022-07-18T00:47:53+05:30

సిబ్బంది చేసిన పొరపాటుకు రెస్టారెంట్ యాజమాన్యం భారీ మూల్యం చెల్లించింది. పన్నీర్ కర్రీకి బదులు చికెన్ కర్రీ పంపినందుకు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సిబ్బంది చేసిన పొరపాటుకు రెస్టారెంట్ యాజమాన్యం భారీ మూల్యం చెల్లించింది. పన్నీర్ కర్రీకి బదులు చికెన్ కర్రీ పంపినందుకు ఏకంగా రూ.20 వేలు జరిమానాగా కట్టింది. మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో ఈ ఘటన జరిగింది. గ్వాలియర్‌లో నివసిస్తున్న అడ్వకేట్ సిద్దార్థ శ్రీవాస్తవ  Zomato ద్వారా పన్నీర్ కర్రీ ఆర్డర్ చేశారు. జొమాటో డెలివరీ ఏజెంట్ కాసేపట్లో ఫుడ్ పార్శిల్ తీసుకొని వచ్చారు. పార్శిల్ ఓపెన్ చేసి చూస్తే అందులో  పన్నీర్ కర్రీ లేదు. చికెన్ కర్రీ కనిపించడంతో శాకాహార కుటుంబానికి చెందిన శ్రీవాస్తవ ఖంగుతిన్నారు.


ఇది కూడా చదవండి..

రాత్రికి రాత్రే మారిపోయిన బ్రిడ్జి.. షాకవుతున్న Chennai వాసులు.. వీడియో వైరల్!


ఫిర్యాదు చేస్తే సంబంధిత వ్యక్తులు పట్టించుకోలేదు. దీంతో శ్రీ వాస్తవ వినియోగదారుల ఫోరంలో కేసు పెట్టారు. రెస్టారెంట్ సిబ్బంది నిర్లక్ష్యం వల్ల తమ కుటుంబానికి మానసికంగా, శారీరకంగా నష్టం వాటిల్లిందని వినియోగదారుల ఫోరంలో కంప్లైంట్ ఇచ్చారు. సిబ్బంది నిర్లక్ష్యమే దీనికి కారణమని కన్స్యూమర్ ఫోరం భావించింది. ఈ ఘటన ఫిర్యాదుదారు కుటుంబాన్ని మానసికంగా ప్రభావితం చేసిందని పేర్కొంది. వినియోగదారుడికి వాటిల్లిన నష్టానికి గానూ రెస్టారెంట్‌ రూ.20,000 పరిహారంగా చెల్లించాలని ఆదేశించింది. అంతేకాదు ఈ కేసుపై పోరాడేందుకు ఫిర్యాదుదారు చేసిన ఖర్చును కూడా చెల్లించాలని ఆదేశించింది.

Updated Date - 2022-07-18T00:47:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising