Viral Video: ఈ వీడియో చూశారా? నిజమైన టామ్ అండ్ జెర్రీ ఇలాగే ఉంటాయేమో..
ABN, First Publish Date - 2022-12-26T15:44:03+05:30
ప్రపంచ వ్యాప్తంగా పెద్ద, చిన్న అనే తేడా లేకుండా అందరినీ అలరించిన కార్టూన్ షో `టామ్ అండ్ జెర్రీ`. పిల్లి, ఎలుక మధ్య జరిగే ఆ పోరాటాలు కొన్ని దశబ్దాలు పాటు అందరినీ ఎంతగానో ఆకట్టుకున్నాయి. నిజ జీవితంలో కూడా ఎలుకకు, పిల్లికి పడదనే సంగతి తెలిసిందే
ప్రపంచ వ్యాప్తంగా పెద్ద, చిన్న అనే తేడా లేకుండా అందరినీ అలరించిన కార్టూన్ షో టామ్ అండ్ జెర్రీ (Tom and Jerry). పిల్లి, ఎలుక మధ్య జరిగే ఆ పోరాటాలు కొన్ని దశబ్దాలు పాటు అందరినీ ఎంతగానో ఆకట్టుకున్నాయి. నిజ జీవితంలో కూడా ఎలుకకు, పిల్లికి పడదనే సంగతి తెలిసిందే. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతోంది. ఆ వీడియోలిని పిల్లి, ఎలుక పోరు చూస్తే టామ్ అండ్ జెర్రీ కార్టూన్ (Real life Tom and Jerry)గుర్తుకు రావడం ఖాయం. వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఓ పిల్లిని ఎలుక బెదిరించడాన్ని చూడవచ్చు.
CCTV_IDIOTS అనే ట్విటర్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. ఈ వీడియోను పోస్ట్ చేసి మీ ప్రత్యర్థిని ఎప్పుడూ తక్కువ అంచనా వేయవద్దు అని కామెంట్ చేశారు. 13 సెకన్లు నిడివి కలిగిన ఈ వీడియోను ఇప్పటివరకు 1.37 లక్షల మందికి పైగా చూశారు. 2 వేలకు పైగా లైక్స్ వచ్చాయి. ఈ వీడియోపై (Viral Video) నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్ చేస్తున్నారు.
Updated Date - 2022-12-26T15:44:05+05:30 IST