ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దారుణం.. చనిపోయిన ఓ వ్యక్తి కాళ్లకు తాడును కట్టి.. జంతువులను ఈడ్చుకెళ్లినట్టుగా లాక్కెళ్తూ..

ABN, First Publish Date - 2022-07-29T01:00:32+05:30

మనుషుల్లో రాను రాను మానవత్వం లేకుండా పోతోంది. కొందరైతే సాటి మనుషుల పట్ల మరీ దారుణంగా ప్రవర్తిస్తుంటారు. మరికొందరు శాడిస్టులు రాక్షసుల మాదిరి ప్రవర్తిస్తుంటారు. బీహార్‌..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మనుషుల్లో రాను రాను మానవత్వం లేకుండా పోతోంది. కొందరైతే సాటి మనుషుల పట్ల మరీ దారుణంగా ప్రవర్తిస్తుంటారు. మరికొందరు శాడిస్టులు రాక్షసుల మాదిరి ప్రవర్తిస్తుంటారు. బీహార్‌ రాష్ట్రంలో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. చనిపోయినా వ్యక్తిని జంతువులను ఈడ్చుకెళ్లినట్లుగా తాడు కట్టి మరీ లాక్కెళ్లారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో వారిపై నెటిజన్లు మండిపడుతున్నారు. వీళ్లసలు మనుషులేనా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే..


బీహార్ రాష్ట్రం బెగుసరాయ్‌ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. గ్రామానికి సమీపంలోని గొయ్యిలో జూలై 27న గుర్తుతెలియని వృద్ధుడి మృతదేహాన్ని గుర్తించారు. అప్పటికే మృతదేహం కుళ్లిన స్థితిలో ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు.. మృతదేహాన్ని దూరం నుంచి చూసి, పారిశుధ్య కార్మికులను పిలిపించారు. కనీసం అంబులెన్స్‌కు కూడా ఫోన్ చేయకుండా అక్కడ నుంచి వెళ్లిపోయారు. పారిశుధ్య సిబ్బంది అక్కడి వెళ్లి మృతదేహం కాళ్లకు తాడు కట్టి రాళ్లు, గంతుల మీదుగా చాలా దూరం లాక్కుంటూ వెళ్లారు. అనంతరం ట్రాక్టర్‌లో పడేశారు.

ఈ స్కూల్‌కు వెళ్లాలంటే పుస్తకాలతో పాటు.. గొడుగులు కూడా తీసుకెళ్లాల్సిందే..!


పోస్టుమార్టం గది వెలుపల తాళ్లతో లాగి స్ట్రెచర్‌ పైన పడేశారు. లోపలికి తీసుకెళ్లే క్రమంలో కూడా నిర్లక్ష్యం ప్రదర్శించారు. ఈ ఘటనను మొత్తం కొందరు వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీనిపై పోలీసు ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు. అంబులెన్స్‌కు ఫోన్ చేయాలన్న విషయాన్ని కూడా పట్టించుకోని  ఇన్‌స్పెక్టర్ అనిల్ కుమార్ సింగ్‌ను సస్పెండ్ చేశారు. అలాగే ఘటన స్థలంలో ఉన్న ఇద్దరు వాచ్‌మెన్‌లపై కూడా చర్యలు తీసుకోవాలని సిఫారసు చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. దీనిపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం చేస్తూ కామెంట్లు పెడుతున్నారు.

Wife Tortured Husband: స్టేషన్‌కు వచ్చిన 73 ఏళ్ల వృద్ధుడు చెప్పింది విని నివ్వెరపోయిన పోలీసులు.. ఏడాది క్రితమే రెండో పెళ్లయిందంటూ..



Updated Date - 2022-07-29T01:00:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising