ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Viral Video: ఈ బుడ్డోడి వంట ప్రావీణ్యం చూస్తే.. ఆశ్యర్యపోవాల్సిందే..

ABN, First Publish Date - 2022-04-07T17:00:03+05:30

కొంతమంది పిల్లలు పెద్దవారిలా ప్రవర్తిస్తుంటారు. చిన్న వయసులోనే ఎంతో తెలివితేటలు కలిగి ఉంటారు. ఆట పాటలతో గడపాల్సిన వయసులో అంతా ఆశ్చర్యపోయేలా ప్రవర్తిస్తుంటారు. కొంతమంది..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కొంతమంది పిల్లలు పెద్దవారిలా ప్రవర్తిస్తుంటారు. చిన్న వయసులోనే ఎంతో తెలివితేటలు కలిగి ఉంటారు. ఆట పాటలతో గడపాల్సిన వయసులో అంతా ఆశ్చర్యపోయేలా ప్రవర్తిస్తుంటారు. కొంతమంది పిల్లలు ఆటల్లో ప్రతిభ చూపుతుంటే... మరికొంత మంది పిల్లలు చదువులో ప్రతిభ చూపుతుంటారు. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే బాలుడు మాత్రం వంట చేయడంలో తన ప్రావీణ్యం కనబరుస్తున్నాడు. ఫ్రైడ్ రైస్ తయారీ విధానాన్ని వివరిస్తూ.. స్వతహాగా చేసి చూపించాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. వివరాల్లోకి వెళితే..


ఇన్‌స్టాగ్రాంలో వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఓ బాలుడు వంట గదిలో స్టౌవ్ వెలిగిస్తాడు. తర్వాత ఓ గిన్నె పెట్టి, అందులో ఫ్రైడ్ రైస్‌కు అవసరమైన పదార్థాలను వేసి కొద్ది సేపు వేయిస్తాడు. మధ్య మధ్యలో ఫ్రైడ్ రైస్‌ తయారీ విధానాన్ని వివరిస్తూ ఉంటాడు. పక్కనే బాలుడి తల్లి అతడికి సహకరిస్తూ ఉంటుంది. నూనెలో వేసిన దినుసులన్నీ వేగిన తర్వాత.. అందులో అన్నం కలుపుతాడు. తర్వాత అందులో కోడి గుడ్డు వేసి.. రుచికరమైన ఫ్రైడ్ రైస్‌ను తయారు చేస్తాడు. చివరగా సిద్ధమైన ఫ్రైడ్ రైస్‌ని కిందకు దించేసి టేస్ట్ చేస్తాడు. తల్లి సాయం తీసుకున్నా.. అతడి వంట తయారీ విధానం అందరినీ ఆకట్టుకుంటోంది. బాలుడు వంట చేసే సమయంలో అతడి తల్లి వీడియో తీసి ఇన్‌స్టాగ్రాంలో షేర్ చేసింది. అంత చిన్న వయసులో అతడు చేసిన వంట వీడియో నెటిజన్లు విపరీతంగా ఆకట్టుకుంటోంది.  బుడ్డోడి టాలెంట్ సూపర్.. అంటూ కామెంట్లు పెడుతున్నారు.

కూరలో కావాలనే ఉప్పు ఎక్కువగా కలిపి టేస్ట్ చూడమన్న భార్య.. ఆ భర్త రియాక్షన్‌కు నెటిజన్లు ఫిదా





Updated Date - 2022-04-07T17:00:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising