ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Viral Video: మీకు రైలు ప్రయాణమంటే ఇష్టమా.. అయితే ఈ వీడియో చూస్తే.. వెంటనే అక్కడికి వెళ్లిపోతారు..

ABN, First Publish Date - 2022-07-31T02:16:09+05:30

ప్రపంచంలోని అత్యంత రద్దీ గల రైల్వే నెట్‌వర్క్‌లలో భారతీయ రైల్వే (Indian Railway) ఒకటి. అలాగే అత్యధిక ఉద్యోగులను కలిగి ఉన్న సంస్థల్లో భారతీయ రైల్వే ద్వితీయ స్థానంలో ఉంది..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రపంచంలోని అత్యంత రద్దీ గల రైల్వే నెట్‌వర్క్‌లలో భారతీయ రైల్వే (Indian Railway) ఒకటి. అలాగే అత్యధిక ఉద్యోగులను కలిగి ఉన్న సంస్థల్లో భారతీయ రైల్వే ద్వితీయ స్థానంలో ఉంది. రోజూ కోట్ల మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరుస్తోంది. ఈ క్రమంలో మన రైళ్లు ఎన్నో సుందర ప్రదేశాల మధ్య ప్రయాణిస్తూ.. ప్రయాణికులకు ఆనందంతో పాటూ ఆహ్లాదాన్ని అందిస్తున్నాయి. ఇదిలావుండగా, రైల్వే మంత్రిత్వ శాఖ ట్విట్టర్‌ ఖాతాలో ఇటీవల ఓ వీడియోను షేర్ చేశారు. రాజస్థాన్‌ (Rajasthan) లోని దారా ఘాట్‌‌లో అందమైన ప్రకృతి గుండా రైలు ప్రయాణిస్తున్న వీడియోను చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.


చాలా మందికి రైలు ప్రయాణమంటే ఎంతో ఇష్టం ఉంటుంది. అందులోనూ అందమైన వనాలతో కూడిన ప్రకృతి మధ్య ప్రయాణించడం అంటే మరీ ఇష్టం. కొన్ని ప్రాంతాల గురించి తెలుసుకుంటే.. జీవితంలో ఒక్కసారైనా అలాంటి అందమైన ప్రదేశాల్లో ప్రయాణించాలని అంతా తహతహలాడుతుంటారు. అలాంటి వారికి రాజస్థాన్‌లోని దారా ఘాట్‌ ప్రాంతం కూడా ఎంతో నచ్చుతుందనడంలో అతిశయోక్తి లేదు. కొండలు, అడవుల మధ్య.. మెలికలు తిరుగుతూ వెళ్తున్న రైలును చూసి.. వావ్! అద్భుతం అంటూ కొందరు స్పందిస్తున్నారు. ఈ వీడియో మమ్మల్ని మంత్రముగ్ధులను చేస్తోంది.. అంటూ మరికొందరు కామెంట్లు పెడుతున్నారు. ఇంకెందుకు ఆలస్యం.. మీరూ ఓసారి లుక్కేయండి మరి.

HarGharTrianga : చేతిలో జెండా పట్టుకుని జాతీయ గీతం ఆలపిస్తున్న కశ్మీర్ పిల్లలు.. చూడముచ్చటగా ఉందంటున్న నెటిజన్లు..





Updated Date - 2022-07-31T02:16:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising