Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement
Published: Sat, 30 Jul 2022 18:52:29 IST

HarGharTrianga : చేతిలో జెండా పట్టుకుని జాతీయ గీతం ఆలపిస్తున్న కశ్మీర్ పిల్లలు.. చూడముచ్చటగా ఉందంటున్న నెటిజన్లు..

twitter-iconwatsapp-iconfb-icon
HarGharTrianga : చేతిలో జెండా పట్టుకుని జాతీయ గీతం ఆలపిస్తున్న కశ్మీర్ పిల్లలు.. చూడముచ్చటగా ఉందంటున్న నెటిజన్లు..

75వ స్వాతంత్ర్య దినోత్సవం (Independence Day) సమీపిస్తున్న సందర్భంగా నార్తర్న్ కమాండ్ - ఇండియన్ ఆర్మీ ఆధ్వర్యంలో ‘‘హర్ ఘర్ త్రిరంగ’’ (HarGharTrianga) ’’ పేరుతో ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించింది. కార్యక్రమంలో భాగంగా ఆగస్టు 13 నుంచి 15వరకు ప్రజలు తమ ఇళ్ల వద్ద త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయాలని పిలుపునిస్తోంది. ఇదిలావుండగా, జూలై 30న నార్తర్న్ కమాండ్ - ఇండియన్ ఆర్మీ (NORTHERN COMMAND - INDIAN ARMY) తమ ట్విట్టర్ ఖాతాలో ఓ వీడియో షేర్ చేసింది. కశ్మీర్‌కు చెందిన పిల్లలు.. చేతిలో జెండాను (National flag) పట్టుకుని, జాతీయ గీతాన్ని (National Anthem) ఆలపించడం.. అందరినీ ఆకట్టుకుంటోంది.

ప్రజల హృదయాల్లో దేశభక్తి భావనను ప్రేరేపించడంతో పాటూ జాతీయ జెండాపై మరింత అవగాహన పెంపొందించాలనే ఉద్దేశంతో కార్యక్రమం చేపట్టినట్లు ఇండియన్ ఆర్మీ పేర్కొంది. ఇటీవల, ఇండియన్ కోస్ట్ గార్డ్.. హర్ ఘర్ తిరంగా ప్రచారంలో పాల్గొని, నీటి అడుగున జాతీయ జెండాను ఎగురవేసింది. ఈ వీడియో కూడా నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో కశ్మీర్ పిల్లలు ఒక చేత్తో జాతీయ జెండాను పట్టుకుని, మరో చేత్తో సెల్యూట్ చేస్తూ.. జన గణ మన అంటూ ఆనందంగా పాడటం చూడొచ్చు. "కశ్మీర్ (Kashmir) నుండి అందమైన వీడియో" అని ప్రస్తావిస్తూ భారత సైన్యం.. ఈ వీడియోను షేర్ చేసింది. దీనిపై నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. హర్ ఘర్ త్రిరంగ కార్యక్రమం సందర్భంగా.. ప్రజలు తమ అధికారిక వెబ్‌సైట్‌లో జెండాను పిన్ చేయవచ్చని ఇండియన్ ఆర్మీ సూచించింది. అలాగే జెండాతో ఉన్న సెల్ఫీలను కూడా అప్‌లోడ్ చేయవచ్చని, తద్వారా వెబ్‌సైట్ నుంచి హర్ ఘర్ త్రిరంగ సర్టిఫికేట్ కూడా పొందవచ్చని పేర్కొంది.

Viral Video: ఈ గొరిల్లా తల్లి ప్రేమను చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది.. అచ్చం మనుషుల్లాగే చేస్తోంది చూడండి..



ఇవి కూడా చదవండిLatest News in Telugu

student love: మధ్యాహ్న సమయంలోనూ తలుపులు మూసిన విద్యార్థి.. ఎంత తట్టినా తీయకపోవడంతో బద్దలు కొట్టి చూడగా.. husband attacked wife: ఆటోలో అత్తగారి ఇంటికి వచ్చిన కోడలు.. మరుక్షణమే డ్రైవర్‌తో సహా యువతిని చెట్టుకు కట్టేసిన వైనం.. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే.. Girl blackmail: ఫోన్లో నాలుగేళ్లుగా దాచిన వీడియోలు ఒక్కసారిగా వెలుగులోకి.. ఎంత పని జరిగిందంటూ యువతి షాక్.. చివరకు ఏమైందంటే..Physical teacher కి ఫోన్ చేసి ఇంటికి పిలిచి.. కాసేపటికి బాత్‌రూంలోకి వెళ్లిన మహిళ.. మరుక్షణంలో దిమ్మదిరిగే షాక్..Tragic incident: బాల్కనీలో ఆడుకుంటున్న చిన్నారులు.. ఒక్కసారిగా దభేల్‌మని శబ్ధం.. తల్లిదండ్రులు పరుగెత్తుకుంటూ వచ్చి చూడగా... ఈ స్కూల్‌కు వెళ్లాలంటే పుస్తకాలతో పాటు.. గొడుగులు కూడా తీసుకెళ్లాల్సిందే..!
Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

ప్రత్యేకంLatest News in Teluguమరిన్ని...

Advertisement
OpinionPoll
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.