ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అంబులెన్స్‌లో నొప్పులతో బాధపడుతున్న నిండు గర్భిణి.. ఎదురుగా రోడ్డుకు అడ్డంగా ఏనుగు.. చివరకు..

ABN, First Publish Date - 2022-04-30T17:13:35+05:30

అటవీ ప్రాంతాల ప్రజలు నిత్యం ఎన్నో రకాల ఇబ్బందులను ఎదుర్కోవడం చూస్తూనే ఉంటాం. ఎప్పుడు ఏ అడవి జంతువు దాడి చేస్తుందో అనే ఆందోళనతో భయం భయంగా..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అటవీ ప్రాంతాల ప్రజలు నిత్యం ఎన్నో రకాల ఇబ్బందులను ఎదుర్కోవడం చూస్తూనే ఉంటాం. ఎప్పుడు ఏ అడవి జంతువు దాడి చేస్తుందో అనే ఆందోళనతో భయం భయంగా జీవనం సాగిస్తుంటారు. మరోవైపు కనీస వసతులు కూడా లేక నిత్యం నరకయాతన అనుభవిస్తూ ఉంటారు. అనారోగ్యానికి గురైనప్పుడు సరైన వైద్య సదుపాయం అందక నిత్యం ఎంతో మంది ప్రాణాలు కోల్పోతుంటారు. ఇప్పుడీ ప్రస్తావన ఎందుకొచ్చిందంటే... తమిళనాడు పరిధిలోని గిరిజన ప్రాంతంలో ఓ నిండు గర్భిణికి పురటినొప్పులు వచ్చాయి. అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలిస్తుండగా.. మధ్యలో ఓ ఏనుగు రోడ్డుకు అడ్డుగా వచ్చింది. చివరకు ఏం జరిగిందంటే..


తమిళనాడు ఈరోడ్ పరిధిలోని అటవీ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానికంగా గిరిజనులు నివాసం ఉంటున్న ప్రాంతంలో గురువారం ఓ గర్భిణికి పురిటినొప్పులు వచ్చాయి. సమీపంలో ఆస్పత్రి లేకపోవడంతో అంబులెన్స్‌కి ఫోన్ చేశారు. అక్కడికి చేరుకున్న వైద్య సిబ్బంది గర్భిణిని అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించారు. అయితే మార్గ మధ్యలో ఓ ఏనుగు వారికి అడ్డుగా వచ్చింది. పక్కకు కదలకుండా అలాగే ఉండిపోయింది. దీంతో చేసేదిలేక అంబులెన్స్ డ్రైవర్ కూడా.. వాహనాన్ని అక్కడే నిలిపేశాడు.

కొద్ది గంటల్లో పెళ్లి జరుగుతుందనగా ఊహించని ఘటన.. పెళ్లి మంటపంలో కలకలం.. వరుడికి మైండ్‌బ్లాక్..!


మరోవైపు గర్భిణికి నొప్పులు ఎక్కువయ్యాయి. దీంతో వైద్య సిబ్బంది చివరకు ఆమెకు వాహనంలోనే ప్రసవం చేశారు. మగబిడ్డకు జన్మనివ్వడంతో పాటూ, తల్లీబిడ్డా క్షేమంగా ఉండడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. తర్వాత కాసేపటికి ఏనుగు అక్కడి నుంచి వెళ్లిపోవడంతో తల్లీబిడ్డను ఆస్పత్రికి తరలించారు. ఇద్దరి ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. సమయస్ఫూర్తితో వ్యవహరించిన వైద్య సిబ్బందిని అంతా అభినందించారు. ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

కదులుతున్న రైలు నుంచి ఒకరి తర్వాత ఒకరుగా ముగ్గురు యువతులు జంప్.. గమనించిన హోంగార్డు వెంటనే కిందకు దిగి..

Updated Date - 2022-04-30T17:13:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising