ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Viral: ఆ తండ్రికి ఎంత కష్టమొచ్చిందో.. ప్రియుడితో భార్య వెళ్లిపోవడంతో ఏడాది కొడుకును ఎత్తుకుని రిక్షా తొక్కుతూ..

ABN, First Publish Date - 2022-08-27T21:51:23+05:30

కూలీ పనులు చేసుకుంటూ బతికే ఓ యువకుడు ఒక అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కూలీ పనులు చేసుకుంటూ బతికే ఓ యువకుడు ఒక అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.. వారికి ఇద్దరు పిల్లలు కూడా పుట్టారు.. ఇటీవల అతడి భార్య మరో వ్యక్తితో ప్రేమలో పడి అతడితో వెళ్లిపోయింది.. దీంతో ఇద్దరు చిన్న పిల్లల బాధ్యత అతడిపైనే పడింది.. చేసేదేమీ లేక ఏడాది వయసున్న ఓ కుమారుడిని ఎత్తుకొని బతుకు తెరువు కోసం రిక్షా(Rickshaw) నడుపుతున్నాడు. ఒంటి మీద కనీసం బట్టలు కూడా లేని ఆ పసివాడి దీన స్థితి చూస్తే ఎంతటి వారైనా జాలి పడతారు. మధ్యప్రదేశ్(Madhyapradesh)​లో ఈ ఘటన జరిగింది. 


ఇది కూడా చదవండి..

Shocking: తనతో ఛాటింగ్ చేయడం లేదని యువకుడి దారుణం.. స్నేహితులతో కలిసి బాలికపై కాల్పులు.. చివరకు..


బీహార్ (Bihar)కి చెందిన రాజేశ్ మల్దార్ అనే యువకుడు పదేళ్ల కిందట మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌కు వలస వెళ్లి కూలీ పని చేసుకుంటూ జీవనం సాగించేవాడు. ఆ సమయంలో స్థానికంగా నివసించే ఓ అమ్మాయితో రాజేశ్‌ ప్రేమలో పడి పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఇద్దరు పిల్లలు పుట్టారు. రోడ్డు పక్కన పుట్​పాత్​పైనే వీరి నివాసం. కాగా, కొద్ది రోజుల క్రితం రాజేశ్ భార్య పిల్లలిద్దరినీ విడిచిపెట్టి ఓ ట్రక్కు డ్రైవర్​తో వెళ్లిపోయింది. భార్య ఆచూకీ కోసం రాజేశ్ ఎంత ప్రయత్నించినా లాభం లేకుండా పోయింది. చిన్న పిల్లలిద్దరినీ వదిలి రిక్షా తొక్కడానికి వెళ్లాల్సి రావడం రాజేశ్‌కు కష్టంగా అనిపించేది. అలాగని పనిలోకి వెళ్లకపోతే కనీసం పూట కూడా గడవని పరిస్థితి. దీంతో రాజేశ్ తన మూడేళ్ల కూతురును తన తల్లి దగ్గర ఉంచి, ఏడాది వయసున్న కొడుకును చేత్తో ఎత్తుకొని రిక్షా నడుపుతున్నాడు. 


కనీసం బట్టలు కూడా లేని ఏడాది వయసున్న బిడ్డను ఎత్తుకుని రిక్షా తొక్కుతున్న రాజేశ్‌ను చూసి, అతడి కథ తెలుసుకున్న ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. గంటల వ్యవధిలోనే ఆ వీడియో వైరల్‌ (Viral Video)గా మారింది. రాజేశ్‌కి సహాయం చేయడానికి కొందరు ముందుకు వస్తున్నారు. మరోవైపు, చైల్డ్​ వెల్ఫేర్ కమిటీ కూడా స్పందించింది. ఇద్దరు పిల్లల భవిష్యత్తు కోసం సహాయం చేస్తామని హామీ ఇచ్చింది.

Updated Date - 2022-08-27T21:51:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising