ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Bihar: `అమ్మా.. నన్ను చంపేస్తారు.. కాపాడండి` అంటూ మహిళ ఫోన్.. తల్లిదండ్రులు, సోదరుడు వెళ్లి చూసే సరికి..

ABN, First Publish Date - 2022-08-28T22:13:45+05:30

ఆ మహిళ శుక్రవారం మధ్యాహ్నం తన తల్లికి ఫోన్ చేసింది.. `అమ్మా.. వీళ్లు నన్ను చంపాలనుకుంటున్నారు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆ మహిళ శుక్రవారం మధ్యాహ్నం తన తల్లికి ఫోన్ చేసింది.. `అమ్మా.. వీళ్లు నన్ను చంపాలనుకుంటున్నారు.. దయచేసి నన్ను కాపాడండి` అని చెప్పింది.. ఆమె తల్లి తన భర్త, కొడుకుతో కలిసి వెంటనే బయల్దేరి రాత్రి 7.30 గంటలకు కూతురి ఇంటికి వెళ్లింది.. అక్కడ తన కూతురు కనిపించలేదు.. `మీ కూతురు ఆత్మహత్య చేసుకుని చనిపోయింద`ని మామగారు చెప్పారు.. తన కూతురిని ఆమె అత్తింటి వారు హత్య చేశారని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది.. బీహార్‌లో ఈ ఘటన జరిగింది. 


ఇది కూడా చదవండి..

Shocking: బాత్రూంలో ఇరుక్కుపోయిన మహిళ.. ప్రాణభయంతో గోడలపై లిప్‌స్టిక్‌తో చివరి మెసేజ్.. మూడు రోజుల తర్వాత..


బీహార్‌ (Bihar)లోని షేక్‌పురా జిల్లాకు చెందిన అర్చన కుమారి (25) అనే మహిళ 2015లో శరద్ కుమార్ అనే వ్యక్తితో ప్రేమలో పడి పెళ్లి చేసుకుంది. వివాహం తర్వాత ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చింది. అంతా ప్రశాంతంగా ఉందనే సమయంలో ఆమె వైవాహిక జీవితంలో కలతలు రేగాయి. ప్రేమ వివాహాన్ని శరద్ తల్లిదండ్రులు మొదటి నుంచి ఆమోదించలేదు. కట్నం కోసం కోడలిని వేధించేవారు. తాజాగా శరద్ కూడా తల్లిదండ్రులతో కలిసి భార్యను వేధించడం ప్రారంభించాడు. 


భార్యతో తరచుగా గొడవపడేవాడు. పిల్లల ముందే ఆమెను కొట్టేవాడు. చివరకు శుక్రవారం ఆమె మరణించింది. అర్చన ఆత్మహత్య చేసుకుని చనిపోయిందని శరద్, అతని తల్లిదండ్రులు చెబుతున్నారు. అయితే అర్చన తల్లిదండ్రులు మాత్రం అది హత్యేనని ఆరోపిస్తున్నారు. చనిపోవడానికి ముందు అర్చన ఫోన్ చేసి కాపాడమని వేడుకుందని అర్చన తల్లి పోలీసులకు చెబుతోంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. 

Updated Date - 2022-08-28T22:13:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising