Shocking: బాత్రూంలో ఇరుక్కుపోయిన మహిళ.. ప్రాణభయంతో గోడలపై లిప్‌స్టిక్‌తో చివరి మెసేజ్.. మూడు రోజుల తర్వాత..

ABN , First Publish Date - 2022-08-28T21:28:03+05:30 IST

ఆ మహిళ స్నానం చేయడానికి తన ఇంటి బాత్రూంలోకి వెళ్లింది.. స్నానం చేసి తలుపు తీద్దామంటే అది ఎంతకీ తెరుచుకోలేదు..

Shocking: బాత్రూంలో ఇరుక్కుపోయిన మహిళ.. ప్రాణభయంతో గోడలపై లిప్‌స్టిక్‌తో చివరి మెసేజ్.. మూడు రోజుల తర్వాత..

ఆ మహిళ స్నానం చేయడానికి తన ఇంటి బాత్రూంలోకి వెళ్లింది.. స్నానం చేసి తలుపు తీద్దామంటే అది ఎంతకీ తెరుచుకోలేదు.. తలుపు స్టక్ అయిపోవడంతో ఆమె బాత్రూంలో ఇరుక్కుపోయింది (woman trapped in the bathroom).. ఇంట్లో ఆమె ఒంటరిగా ఉంటుండడంతో ఎంతగా అరిచినా ఎవరికీ వినబడలేదు.. దాదాపు మూడ్రోజులు ఓ మహిళ బాత్రూంలోనే ఉండిపోయింది. కుళాయి నీళ్లు తాగి ప్రాణాలు కాపాడుకుంది.. ఇక తను బతికి బయటపడతాననే ఆశ కోల్పోయింది.. అయితే చివరకు ఓ అద్భుతం జరిగింది. 


ఇది కూడా చదవండి..

ఆయన కోసం ఏమైనా చేస్తా.. 55 ఏళ్ల వ్యక్తితో ప్రేమలో పడ్డ 18 ఏళ్ల యువతి చెబుతున్న మాటలివీ.. అసలు కథేంటంటే..


థాయ్‌లాండ్‌ (Thailand)లో నివసిస్తున్న 54 ఏళ్ల మహిళ ఈ నెల 22వ తేదీన స్నానం చేయడానికి తన బాత్రూంకు వెళ్లింది. స్నానం చేసిన తర్వాత తలుపు తెరవడానికి ఎంత ప్రయత్నించినా అది తెరుచుకోలేదు. ఆ మహిళ ఒంటరిగా నాలుగో అంతస్తులో నివసిస్తోంది. అందుకే ఆమె అరుపులు ఎవరికీ వినిపించలేదు. ఆమె రాత్రంతా అరుస్తూనే ఉంది. ఆ విధంగా, ఆమె మూడు రోజులు పాటు బాత్రూంలోనే ఉండి సహాయం కోసం ఎదురు చూసింది. కుళాయి నీళ్లతో ఆకలి తీర్చుకుంది. మూడ్రోజులైనా ఎవరూ రాకపోవడంతో ప్రాణం మీద ఆశ వదిలేసుకుంది. ఆ స్థితిలో, ఆ మహిళ లిప్‌స్టిక్‌తో బాత్రూం గోడపై తన వీలునామాను రాసింది. ఆస్థిని కుటుంబంలోని ఎవరెవరికి ఎంతెంత ఇవ్వాలో రాసింది. 


మూడ్రోజుల నుంచి తన సోదరి నుంచి ఫోన్ రాకపోవడంతో, తను చేసినా ఆమె లిఫ్ట్ చేయకపోవడంతో ఆ మహిళ సోదరికి అనుమానం కలిగింది. వెంటనే ఆమె స్థానిక పోలీసులకు ఫోన్ చేసి ఫిర్యాదు చేసింది. సమాచారం అందుకున్న పోలీసు బృందం మహిళ ఇంటికి చేరుకుంది. తలుపులు పగులగొట్టి బాత్‌రూమ్‌లోకి వెళ్లగా లోపల ఆ మహిళ అపస్మారక స్థితిలో పడి ఉంది. వెంటనే మహిళను పోలీసులు ఆస్పత్రికి తరలించారు. చికిత్స అనంతరం వైద్యులు ఆమెను డిశ్చార్జి చేశారు. 

Updated Date - 2022-08-28T21:28:03+05:30 IST