ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆవు పేడను ఇలా కూడా వాడొచ్చా.. ఇటుకలు తయారు చేసి, లక్షలు సంపాదిస్తున్న లెక్చరర్‌.. ఇంతకీ అది ఎలాగంటే..

ABN, First Publish Date - 2022-05-26T21:25:07+05:30

ఇంట్లో ఆవు ఉంటే దేనికీ కొదవ ఉండదంటారు. ఆవు ఇచ్చే పాలే కాక.. ఆవు పేడతోనూ లాభాలు పొందుతారు. ఆవు పేడను కొంతమంది ఎరువుగానూ వాడతారు. హర్యానాకు చెందిన ఓ ప్రొఫెసర్‌..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంట్లో ఆవు ఉంటే దేనికీ కొదవ ఉండదంటారు. ఆవు ఇచ్చే పాలే కాక.. ఆవు పేడతోనూ లాభాలు పొందుతారు. ఆవు పేడను కొంతమంది ఎరువుగానూ వాడతారు. హర్యానాకు చెందిన ఓ ప్రొఫెసర్‌ ఆవు పేడతో ఇప్పుడు లక్షలు సంపాదిస్తున్నారు. డాక్టర్ శివదర్శన్ మాలిక్‌ అనే ప్రొఫెసర్‌.. వేదిక్ ప్లాస్టర్, గో క్రీట్ ఇటుకలను అభివృద్ధి చేశారు. రోహ్‌తక్‌ యూనివర్శిటీ నుంచి పీహెచ్‌డీ చేసిన శివదర్శన్ మాలిక్‌.. ప్రస్తుతం లెక్చరర్‌గా పని చేస్తున్నారు. పూర్వం తాటాకు ఇళ్లల్లో ఆవుపేడతో ప్లాస్టరింగ్ చేసుకునేవారు. ఆవుపేడ వేసవి కాలంలో ఇళ్లను చల్లగా ఉంచడంతో పాటు.. చలికాలంలో ఇన్సులేషన్‌గా పని చేస్తుంది. ఇప్పుడు ఎక్కడ చూసినా కాంక్రీట్ బిల్డింగ్స్‌ నిర్మాణమవుతున్నాయి.


ఇది కాలుష్యానికి పెద్ద దెబ్బగా భావించిన శివదర్శన్ మాలిక్‌ గో ఆధారిత ఇటుకలతో పాటు ప్లాస్టర్ ఆఫ్ పారిస్ స్థానంలో వేదిక్ ప్లాస్టర్‌ను తయారు చేశారు. బిల్డింగ్‌ గోడలకు ఉపయోగించే ప్లాస్టర్‌ ఆఫ్ పారిస్‌ను ఈ వేద ప్లాస్టర్ రీప్లేస్ చేస్తుందన్నారు శివదర్శన్. ఆవుపేడ, బంకమట్టి, వేప ఆకులు, జిప్సం, క్లస్టర్ బీమ్స్, సున్నపురాయితో కలిపి దీనిని తయారు చేస్తున్నారు. బయటనుంచి వచ్చే వేడిని వేదిక్ ప్లాస్టర్‌ అడ్డుకుని గదులను చల్లగా ఉంచుతుందని తెలిపారు. ప్రస్తుతమున్న కాంక్రీట్ ఇళ్లలో ఉన్న ప్లాస్టర్‌ ఆఫ్‌ పారిస్‌ను తొలగించి వేద ప్లాస్టర్‌ను వేసుకోవచ్చన్నారు. ప్రస్తుతం భారత్‌లో 20 వేలకు పైగా ఇళ్లల్లో వేద ప్లాస్టర్‌ను ఉపయోగిస్తున్నారని తెలిపారు. వేదిక్ ప్లాస్టర్‌తో పాటు సుదర్శన్ గోక్రీట్‌ ఇటుకలను తయారు చేస్తున్నారు.

సివిల్ ఇంజనీర్‌ జాబ్‌కు గుడ్‌బై.. ఇప్పుడు రోజుకు 6 వేల సంపాదన.. ఇంతకీ ఇతడు చేస్తున్న పనేంటంటే..


సాధారణ ఇటుకలు ఎండను గ్రహిస్తాయని.. కానీ ఈ ఇటుకల్లో ఆవుపేడ ఉండడంతో వేడి గది లోపలికి రాదని తెలిపారు. హర్యానాలో ఉన్న వేదిక్ వర్క్‌షాప్‌లో శివదర్శన్..  గోక్రీట్, వేదిక్ ప్లాస్టర్‌ తయారీపై అవగాహన కల్పిస్తున్నారు. తమ తమ ప్రాంతాలకు వెళ్లి సొంతంగా ఇటుకలు తయారు చేసుకునేలా ఆయన వారికి శిక్షణనిస్తున్నారు. భారత్‌తో పాటూ విదేశాల నుంచి వచ్చిన సుమారు 150 మంది శివదర్శన్ వర్క్‌షాప్‌కు హాజరయ్యారు. వేదిక్ ప్లాస్టర్‌ వర్క్‌షాప్‌లో ప్రతీ సంవత్సరం 5 టన్నుల ప్లాస్టర్‌ను తయారు చేస్తున్నారు. దేశవ్యాప్తంగా 15 మంది డీలర్లతో ప్రతి సంవత్సరం 10 లక్షలకు పైగా ఆదాయం సంపాదిస్తున్నారు. 

డబ్బుల్లేక ఇంటర్‌తోనే చదువుకు పులుస్టాప్.. ఇప్పుడు ఏడాదికి రూ.2 కోట్ల ఆదాయం.. ఈ కుర్రాడు చేసే పనేంటంటే..

Updated Date - 2022-05-26T21:25:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising