ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పొలంలో కరెన్సీ నోట్ల కట్టలు.. ట్రాక్టర్‌తో దున్నుతోంటే బయటపడిన బస్తాలో లక్షల కొద్దీ డబ్బు..!

ABN, First Publish Date - 2022-06-29T02:06:54+05:30

ఆ వ్యక్తి ట్రాక్టర్‌తో పొలం దున్నుతున్నాడు.. కొద్ది సేపటి తర్వాత ట్రాక్టర్ నాగలికి ఓ బస్తా తగిలింది..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆ వ్యక్తి ట్రాక్టర్‌తో పొలం దున్నుతున్నాడు.. కొద్ది సేపటి తర్వాత ట్రాక్టర్ నాగలికి ఓ బస్తా తగిలింది.. దానిని విప్పి చూసి ఆ వ్యక్తి షాకయ్యాడు.. ఆ సంచిలో కరెన్సీ నోట్ల కట్టలు కనిపించాయి.. అయితే అవన్నీ రద్దైన 1000, 500 నోట్లు.. వెంటనే అతను ఆ విషయాన్ని పొలం యజమానికి, గ్రామస్తులకు చెప్పాడు.. దీంతో గ్రామస్థులు పొలం వైపు పరుగులు తీశారు.. ఎవరి చేతికి దొరికిన నోట్లు వారు తీసుకుని పారిపోయారు.. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.  అయితే, అప్పటికే గ్రామస్తులు మొత్తం నోట్లను తీసుకుని పారిపోయారు.


ఇది కూడా చదవండి..

Crime: ప్రియురాలు అవాయిడ్ చేస్తోందని ప్రియుడి ఆగ్రహం.. ఇంటికెళ్లి ఎంత పని చేశాడంటే..


బీహార్‌లోని సిగోరీ పరిధిలోని  పసోధా గ్రామంలోని పొలంలో పాతిపెట్టిన పాత 500, 1000 నోట్ల కట్టలు పొలం దున్నుతుండగా బయటపడ్డాయి. బస్తా నిండుగా డబ్బులు ఉన్న విషయం తెలుసుకున్న గ్రామస్తులు పొలం వైపు పరుగులు పెట్టారు. తమకు అందినన్ని కరెన్సీ నోట్లను పట్టుకుని పారిపోయారు. ఎవరో పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అయితే, అప్పటికే గ్రామస్తులు మొత్తం నోట్లను తీసుకుని పారిపోయారు.


ఇంత పెద్ద మొత్తంలో పాత నోట్లను ఎవరు భూమిలో దాచి ఉంచారనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. దోపిడీకి గురైన పాత నోట్లను స్వాధీనం చేసుకునేందుకు పోలీసులు గ్రామంలో గాలింపు చర్యలు చేపట్టారు.

Updated Date - 2022-06-29T02:06:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising