ఆ యువతీయువకులిద్దరిదీ ఒకే గ్రామం.. ఇద్దరి మధ్య పరిచయం స్నేహంగా మారింది.. ఇద్దరూ చనువుగా ఉండే వారు.. తరచుగా కలుసుకుని మాట్లాడుకునే వారు.. కొన్ని రోజుల క్రితం ఆ అమ్మాయికి వేరే ఊరిలో ఉద్యోగం వచ్చింది.. అక్కడకు వెళ్లిపోయిన ఆమ్మాయి ఆ యువకుడితో మాటలు తగ్గించింది.. దీంతో ఆ యువతిపై యువకుడు కోపం పెంచుకున్నాడు.. ఆ యువతి ఉంటున్న ఇంటికి వెళ్లి గొడవపడ్డాడు.. తీవ్ర ఆగ్రహానికి గురై కత్తితో అమ్మాయి మణికట్టు కోసేసి పారిపోయాడు.
ఛత్తీస్‌గఢ్‌లోని చిర్మిరి అనే గ్రామానికి చెందిన ఆకాష్ సాహు అనే యువకుడు.. అదే గ్రామంలో ఉండే యువతిని ప్రేమించాడు. ఆమె కూడా ఆకాష్‌తో సన్నిహితంగా మెలిగేది. ఇద్దరూ తరచుగా కలుసుకుని మాట్లాడుకునేవారు. కొన్ని రోజుల క్రితం ఆ అమ్మాయికి బిలాస్‌పూర్‌లో ఉద్యోగం వచ్చింది. బిలాస్‌పూర్ వెళ్లిపోయిన తర్వాత ఆ అమ్మాయి ఆకాష్‌తో మాట్లాడటం తగ్గించేసింది. దీంతో ఆ అమ్మాయిపై ఆకాష్ కోపం పెంచుకున్నాడు. ఆదివారం సాయంత్రం నేరుగా అమ్మాయి ఉంటున్న ఇంటికి వెళ్లాడు. ఆమెతో వాగ్వాదానికి దిగాడు.
ఇద్దరూ చాలా సేపు వాదించుకున్నారు. తీవ్ర ఆగ్రహానికి గురైన ఆకాష్.. తన వెంట తెచ్చుకున్న కత్తితో అమ్మాయి మణికట్టు కోసేశాడు. ఆ అమ్మాయి గట్టిగా కేకలు వేయడంతో అతను పారిపోయాడు. వెళుతూ తనతో పాటు ఆ అమ్మాయి మొబైల్ ఫోన్‌ను కూడా పట్టుకుపోయాడు. కేకలు విన్న స్థానికులు ఆ అమ్మాయిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఆమె ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉంది. అమ్మాయి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
ఇవి కూడా చదవండి