ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Mahesh Babu: ‘ఒక్కడు’ సినిమా వెనుక ఇంత కథ ఉందా..

ABN, First Publish Date - 2022-11-26T13:17:13+05:30

‘మనసంతా నువ్వే’ చిత్రం హిట్‌ అయినా, కాకపోయినా ‘ఒక్కడు’ సినిమా మీరు తీయాల్సిందే.. అని మహేశ్‌ పట్టుబట్టారు. ఆ కథ ఆయనకు అంతగా

Okkadu Movie Still
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

‘మురారి’ (Murari) చిత్రం తర్వాత మహేశ్‌ (Mahesh)‌తో ఓ సినిమా ప్లాన్‌ చేశారు నిర్మాత ఎమ్మెస్‌ రాజు (MS Raju). నిజం చెప్పాలంటే ఉదయ్‌కిరణ్‌ (Uday Kiran) హీరోగా నటించిన ‘మనసంతా నువ్వే’ (Manasantha Nuvve) చిత్ర కథ మొదట మహేశ్‌కు చెప్పారాయన. అయితే ఎందువల్లో కానీ మహేశ్‌ ఆ కథ మీద ఆసక్తి చూపించలేదు. ఆ సమయంలోనే దర్శకుడు గుణశేఖర్‌ (Gunasekhar) ‘ఒక్కడు’ (Okkadu) చిత్ర కథ చెప్పారు ఆ కథ మహేశ్‌కు బాగా నచ్చింది. కానీ ఆ సినిమా కోసం భారీ వ్యయంతో చార్మినార్‌ (Charminar) సెట్‌ వేయాలి. ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. అయినా పాయింట్‌ కొత్తగా ఉంది కనుక ఆ కథ మీద ఆసక్తి చూపించారు మహేశ్‌. ఆ కథతో సినిమా తీద్దామని ఎమ్మెస్‌ రాజుకు చెప్పారు. ఆయన కూడా ఆసక్తి చూపించారు కానీ భారీ వ్యయంతో సినిమా తీయడానికి ఆయన దగ్గర అంత డబ్బు లేదు. పైగా ‘మనసంతా నువ్వే’ చిత్రం నిర్మాణ దశలో ఉంది. ఆ సినిమా హిట్‌ అయితే వచ్చిన డబ్బంతా ‘ఒక్కడు’ సినిమా కోసం ఖర్చు పెడతానని మహేశ్‌తో చెప్పారు. ‘మనసంతా నువ్వే’ చిత్రం హిట్‌ అయినా, కాకపోయినా ‘ఒక్కడు’ సినిమా మీరు తీయాల్సిందే.. అని మహేశ్‌ పట్టుబట్టారు. ఆ కథ ఆయనకు అంతగా నచ్చింది మరి.

‘చార్మినార్‌ సెట్‌ వేయడమే ఈ చిత్రానికి భారం అనుకుంటే ఆ సెట్‌ వద్దే వద్దు. రియల్‌ చార్మినార్‌ దగ్గరే షూట్‌ చేద్దాం’ అని కూడా అన్నారు. దాంతో అయిష్టంగానే అంగీకరించారు ఎమ్మెస్‌ రాజు. అయితే ‘మనసంతా నువ్వే’ చిత్రం ఘన విజయం సాధించింది. ఆ సినిమాకు వచ్చిన డబ్బంతా ‘ఒక్కడు’ కోసం ఖర్చు పెట్టేశారు ఎమ్మెస్‌ రాజు. భారీ స్థాయిలో చార్మినార్‌ సెట్‌ కూడా వేశారు. 14 కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌‌తో రూపుదిద్దుకొన్న ‘ఒక్కడు’ చిత్రం 2003 జనవరి 15న విడుదలై సూపర్‌ హిట్‌ అయింది. భూమిక (Bhoomika Chawla) హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రంలో ప్రకాశ్‌రాజ్‌ (Prakash Raj) విలన్‌గా నటించారు. ‘మనసంతా నువ్వే’ చిత్రం తర్వాత ఉదయకిరణ్‌, ఆర్తీ అగర్వాల్‌ కాంబినేషన్‌లో తీసిన ‘నీ స్నేహం’ (Nee Sneham) చిత్రం వల్ల కలిగిన నష్టాన్ని కూడా ‘ఒక్కడు’ సినిమా పూడ్చేసింది.

-వినాయకరావు

Updated Date - 2022-11-26T18:25:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising