ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Train Journey: రాత్రిళ్లు రైలు ప్రయాణం చేస్తున్నారా..? ఈ కొత్త రూల్స్ ను తెలుసుకుంటేనే బెటర్

ABN, First Publish Date - 2022-11-11T13:13:38+05:30

ఇండియన్ రైల్వే కొత్త రూల్స్ తీసుకొచ్చింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నిరంజన్ తన స్నేహితులతో కలసి ప్రయాణానికి ఏర్పాట్లు చేసుకున్నాడు. అందుకోసం సీట్లు కూడా బుక్ చేసుకున్నారు. తన క్లోజ్ ఫ్రెండ్ ప్రశాంత్ బర్త్ డే కదులుతున్న ట్రైన్ లో సెలబ్రేట్ చేసి ఆ పుట్టినరోజును ఫ్రెండ్ కు మంచి మెమరీగా మార్చాలని అతడి ఆరాటం. అంతా అనుకున్నట్టే అరెంజ్ చేసుకున్నారు. రాత్రి ప్రయాణంలో స్నేహితులందరూ కలసి ప్రశాంత్ పుట్టిరోజు కేక్ కట్ చేసి గోల చేస్తుండగా అక్కడికి ఒక్కసారిగా రైల్వే పోలీసులు వచ్చారు, అర్దరాత్రి పూట ట్రైన్ లో ఏంటి న్యూసెన్స్ అంటూ వారిని వారించడమే కాకుండా వారికి జరిమానా విధించారు. అనంతరం వారి నుంచి ఫైన్ వసూలు చేసుకుని ఇకమీదట ఇలాంటివి చేయకండంటూ అక్కడి నుంచి వెళ్తూ.. రైల్వే కొత్త రూల్స్ తెలుసుకుని ఫాలో కావాల్సిందిగా సూచించారు. తాము అనుకున్నదానికి సీన్ రివర్స్ అవడంతో నిరంజన్ తో పాటు స్నేహితులు అందరూ కూడా నీరసపడిపోయారు. కొత్త రూల్స్ ఏంటి అంటూ ఒకరి ముఖాల్లోకి మరొకరు చూసుకున్నారు. నిరంజన్ వెంటనే రైల్వే కొత్త నిబంధనల కోసం గూగుల్ లో వెతకడం మొదలు పెట్టాడు.ఇది కల్పితంగా చెప్పిన కథ అయినా రైలు ప్రయాణాలు చేసే వారు ఇకపై ఇలాంటివి చేయకూడదనే కోణంలో తాజాగా ఇండియన్ రైల్వే కొత్త రూల్స్ తీసుకొచ్చింది.

రైలు ప్రయాణాలు చేసే ప్రయాణికులు తోటి ప్రయాణికుల నుండి అసౌకర్యాన్ని ఎదుర్కోకుండా వారి ప్రయాణం సాఫీగా సాగడానికి తాము కొత్త నిబంధనలు జారీ చేసినట్టు తెలిపింది. చాలా వరకు తమకు వస్తున్న ఫిర్యాదులలో తోటి ప్రయాణికులు అర్థరాత్రి అయినా గట్టిగా ఫోన్ మాట్లాడటం, పాటలు సినిమాలు వంటివి పెద్ద సౌండ్ తో పెట్టుకోవడం, కంపార్ట్మెంట్ లలో ఎంత సేపైనా లైట్ లు ఆన్ లోనే ఉంచడం వంటి చర్యల వల్ల తోటి ప్రయాణికులు ఎంతగానో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారట. వీటన్నిటినీ దృష్టిలో ఉంచుకుని రైల్వే కొత్త నిబంధనలు అమలు చేసింది. వాటిని కాదని ప్రవర్తిస్తే అందుబాటులోనే ఉండే రైల్వే సిబ్బంది, రైల్వే పోలీసులు వారి వృత్తికి పని చెప్పాల్సి ఉంటుంది.

ఇక నిబంధనల విషయానికి వస్తే...

రాత్రి సమయంలో 10 గంటల తరువాత రైల్వే కంపార్ట్మెంట్ లలో ఫోన్ లు గట్టిగా మాట్లాడకూడదు, లైట్స్ వేసి ప్రయాణికులను ఇబ్బంది పెట్టకూడదు. బర్త్ డేలు, పార్టీలు లాంటివి సెలబ్రేట్ చేయకూడదు. పెద్ద పెద్ద సౌండ్స్ తో పాటలు, సినిమాలు పెట్టుకోకూడదు, తోటి ప్రయాణికులను ఇబ్బంది పెట్టే ఏ పని చేసినా చర్యలు తప్పవని ఇండిన్ రైల్వేస్ హెచ్చరించింది. కాబట్టి రైలు ప్రయాణాలలో కాస్త జాగ్రత్త సుమీ..

Updated Date - 2022-11-11T13:16:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising