ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రిసెఫ్షన్‌లో గాడిద పిల్ల ప్రత్యక్షం.. ఆశ్చర్యపోయిన బంధువులు, ఆత్మీయులు.. పెళ్ళికొడుకు వింత సమాధానం..

ABN, First Publish Date - 2022-12-10T13:24:32+05:30

రిసెప్షన్లో గాడిద పిల్ల ఏంటని నోళ్ళు వెళ్ళబెట్టారు అయితే

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రిసెప్షన్ చాలా వేడుకగా జరుగుతోంది. అక్కడికి వచ్చిన వారందరూ కొత్త దంపతులను చూసి మరింత ఉత్సాహంగా ఉన్నారు. అప్పుడే ఉన్నట్టుండి అక్కడ ఓ గాడిద పిల్ల ప్రత్యక్షం అయ్యింది. దాని మెడకు తాడు వేసి అక్కడికి పట్టుకుని వచ్చాడొక వ్యక్తి. అక్కడున్న అందరూ షాక్ అయ్యారు. రిసెప్షన్లో గాడిద పిల్ల ఏంటని నోళ్ళు వెళ్ళబెట్టారు. అయితే పెళ్ళికొడుకే దాన్ని తెప్పించాడట. ఇంతకూ ఈ గాడిద పిల్ల కథ ఏంటంటే....

అజ్లాన్ అనే వ్యక్తి పాకిస్తాన్లో ఫేమస్ యూట్యూబర్. అతను యూట్యూబ్‌లో చాలా వీడియోస్ పోస్ట్ చేస్తుంటాడు. కాగా అతను రీసెంట్‌గా వరిషా అనే అమ్మాయిని ఎంతో సాంప్రదాయబద్దంగా, పెద్దలందరి సమక్షంలో పెళ్ళి చేసుకున్నాడు. పెళ్ళి తరువాత రిసెప్షన్ ఎంతో గ్రాండ్‌గా ప్లాన్ చేశాడు. ఆ రిసెప్షన్లో గాడిద పిల్ల కనిపించడంతో అందరూ ఆశ్చర్యపోయారు. అయితే అజ్లాం 'నేనే దాన్ని డబ్బు పెట్టి మరీ తెప్పించాను. ఇది నా భార్య వరిషాకు గిప్ట్ ఇవ్వడానికి' అని చెప్పాడు. ఆ మాట విన్న అందరూ షాక్ అయ్యారు. ‘భార్యకు ఎవరైనా గోల్డ్, డైమండ్ లేదా ఇంకా వేరే విలువైన వస్తువులను గిఫ్ట్‌గా ఇస్తారు కానీ గాడిద పిల్లను బహుమతిగా ఇవ్వడం వింతగా ఉంది’ అన్నారు.

'నేను గాడిద పిల్లను గిప్ట్‌గా ఇవ్వడం వెనక రెండు కారణాలు ఉన్నాయి. అందులో ఒకటి నా భార్యకు గాడిదపిల్లలు అంటే చాలా ఇష్టం. రెండోది ప్రపంచంలో చాలా కష్టపడి పనిచేసే జంతువు గాడిద. కాబట్టి అందరూ దానికి సరైన గౌరవం ఇవ్వాలి' అని చెప్పాడు. అతను చెప్పింది విన్న తరువాత అక్కడున్న అందరూ అతడిని మెచ్చుకున్నారు.

వరిషా మాట్లాడుతూ 'నేను ఎప్పుడూ దీన్ని గాడిద అనే కోణంలో చూడను. ఇకమీదట ఇది నాకు ఇష్టమైన జంతువు' అని చెప్పింది. కొత్తపెళ్ళికూతురు వరిషాకు మాత్రమే కాకుండా ఆమె తల్లికి కూడా గాడిదపిల్లలంటే చాలా ఇష్టమంట. తన భార్యకు బహుమతిగా గాడిద ఇవ్వడాన్ని వీడియో తీసి తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేశాడు. ఈ వీడియో చూసిన వారందరూ ఎంతగొప్ప జంతుప్రేమికులో అంటున్నారు. గాడిదపిల్లను తన భార్య కోసం కొన్న అజ్లాన్ కేవలం పిల్లను కొని దాన్ని తన తల్లి నుండి దూరం చెయ్యకుండా 30వేలు వెచ్చించి గాడిదపిల్ల తల్లిని కూడా కొనేశాడట. 'నా భార్యకు నచ్చిన బహుమతి ఇచ్చాను బయటివారు ఏమనుకున్నా అది నాకు అనవసరం' అన్నాడు అజ్లాన్. ఈ కొత్త దంపతులు ఆ గాడిదపిల్ల విషయంలో మరొక కొత్త నిర్ణయం తీసుకోబోతున్నారట. గాడిద పిల్లను దత్తత తీసుకోవాలని అనుకుంటున్నారట. ఈ గాడిద గిప్ట్ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. వీరి గాడిద ప్రేమ బంగారం కానూ అనుకుంటున్నారు నెటిజన్లు.

Updated Date - 2022-12-10T13:24:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising