ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఈ డాక్టర్ మామూలోడు కాదు.. పిల్లలను ఇట్టే మాయచేస్తున్నాడు..

ABN, First Publish Date - 2022-12-06T14:55:03+05:30

అలాగని ఈయనకు మంత్రాలేవి రావండి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

డాక్టర్ లు దేవుళ్ళు. పైనున్న దేవుడు మనుషులను పుట్టిస్తే డాక్టర్ లు చేజారిపోయే మనుషుల ప్రాణాలను నిలబెడుతుంటారు. అయితే హాస్పిటల్ అంటేనే సూదులు, మందులు మొదలైన వాటితో బాధాకరంగా ఉంటుంది. పెద్దవాళ్ళే వీటికి కాసింత భయం, చికాకు వ్యక్తం చేస్తారు. ఇక చిన్నపిల్లల గురించి ప్రత్యేకంగా చెప్పాలా?? ఇంజెక్షన్ పడితే కెవ్వున ఏడ్చే పిల్లలే కనబడతారు మనకు. కానీ పిల్లలకు ఇంజెక్షన్ వేస్తూ వారు ఏడవకుండా మాయ చేస్తున్నాడో డాక్టర్. ఇంతకూ ఆ డాక్టర్ ఎవరంటే..

డా.సయ్యద్ ముజాహిద్ హుస్సేన్ పిల్లల వైద్యుడిగా బెంగుళూరులో గుడ్ విల్ పిల్లల ఆసుపత్రిలో వైద్యసేవలు అందిస్తున్నారు. ఈయన దగ్గరకు వచ్చే పిల్లలకు వైద్యం చేసేటపుడు పిల్లలు ఏడవకుండా ఇట్టే మాయ చేస్తున్నాడు. అలాగని ఈయనకు మంత్రాలేవి రావండి. ఈయన పిల్లలకు ఇంజెక్షన్ లు వెసేటపుడు పిల్లలను బాగా ఆడిస్తాడు, చక్కిలిగింతలు పెడతాడు, బొమ్మలతో పిల్లలను మంచి మూడ్ లోకి తీసుకెళతాడు. పిల్లలు మంచి మూడ్ లోకి వెళ్ళి బాగా నవ్వుతున్నప్పుడు వారికి తెలియకుండానే మెల్లిగా సూది వేసేస్తాడు. పిల్లలు కనీసం నొప్పితో కదలడం కూడా జరగదు ఈయన ఇంజెక్షన్ వేస్తున్నంతసేపు. పైగా పిల్లలు అలా నవ్వుతూనే ఉంటారు. తన పని అయిపోగానే ఈ డాక్టర్ పిల్లలతో హై-ఫై కొడుతూ వాళ్ళను మెచ్చుకుంటాడు కూడా. ఆయన ఆరునెలల పిల్లాడికి వ్యాక్సిన్ వేస్తున్నప్పుడు వీడియో రికార్డ్ చేసి ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసారు. ఈ వీడియోలో అచ్చం పైన చెప్పుకున్నట్టు పిల్లాడికి ఏమాత్రం నొప్పి తెలియకుండా, పిల్లాడు ఏడవకుండా ఈయన ఇంజెక్షన్ వేశారు.

ఈయన ఇంజెక్షన్ వేస్తున్నప్పటి వీడియోను ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేయగా అది చూసిన నెటిజన్లు ఈయన ది బెస్ట్ డాక్టర్ అని ఒకరు, ఇంజెక్షన్ భలే వేశారు అని మరొకరు డాక్టర్ సయ్యద్ మీద ప్రసంశల వర్షం కురిపించారు.

Updated Date - 2022-12-06T14:55:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising