ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Gujarat Teacher: ట్యూషన్ టీచర్ అమానుషం.. విద్యార్థిని చేత బలవంతంగా మందు తాగించి..

ABN, First Publish Date - 2022-08-05T23:02:56+05:30

విద్యార్థులకు విద్యా బుద్ధులు చెప్పాల్సిన కొందరు ఉపాధ్యాయులు (Teacher) పైశాచికంగా వ్యవహరిస్తున్నారు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విద్యార్థులకు విద్యా బుద్ధులు చెప్పాల్సిన కొందరు ఉపాధ్యాయులు (Teacher) పైశాచికంగా వ్యవహరిస్తున్నారు. గురుతర బాధ్యతను మరిచి అమానుషంగా ప్రవర్తిస్తున్నారు. తమ దగ్గర చదువుకుంటున్న విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు. గుజరాత్‌కు చెందిన ఓ ఉపాధ్యాయుడు ట్యూషన్ కోసం వచ్చిన బాలికతో అసభ్యంగా వ్యవహరించాడు. చివరకు కటకటాల పాలయ్యాడు. 


ఇది కూడా చదవండి..

Mother Threw Daughter: ఘోరం.. కన్న కూతురిని నాలుగో అంతస్థు నుంచి విసిరేసిన తల్లి..!


గుజరాత్‌లోని (Gujarat) వడోదరలోని నిజాంపూర ప్రాంతంలో ప్రశాంత్ ఖోస్లా అనే వ్యక్తి ట్యూషన్ సెంటర్ నడుపుతున్నాడు. చాలా మంది బాలబాలికలు అతని దగ్గరకు ట్యూషన్‌ కోసం వస్తుంటారు. గత బుధవారం అతను ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో ఓ బాలిక ట్యూషన్ కోసం వెళ్లింది. ఆ బాలికను ప్రశాంత్ ఇంటి లోపలికి తీసుకెళ్లాడు. తనతో కలిసి మద్యం తాగాలంటూ (Teacher Forces Girl To Drink Alcohol) బలవంతం చేశాడు. అందుకు ఆ బాలిక నిరాకరించింది. దీంతో బలవంతంగా ఆ బాలిక నోట్లో ప్రశాంత్ మద్యం పోశాడు. 


మద్యం వల్ల బాలిక అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. వెంటనే ఆ బాలికను ప్రశాంత్ ఇంటి దగ్గర వదిలేసి వెళ్లిపోయాడు. బాలిక పరిస్థితిని గమనించిన తల్లిదండ్రులు వెంటనే ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. చికిత్స అనంతరం మెలకువలోకి వచ్చిన బాలిక ట్యూషన్ టీచర్ చేసిన పని గురించి తల్లిదండ్రులకు చెప్పింది. వెంటనే ఆ బాలిక కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రశాంత్‌ను అదుపులోనికి తీసుకుని విచారణ చేపట్టారు.

Updated Date - 2022-08-05T23:02:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising