Mother Threw Daughter: ఘోరం.. కన్న కూతురిని నాలుగో అంతస్థు నుంచి విసిరేసిన తల్లి..!
ABN , First Publish Date - 2022-08-05T22:28:28+05:30 IST
కన్న బిడ్డకు చిన్న దెబ్బ తగిలితేనే తల్లి తట్టుకోలేదు. బిడ్డకు నయమయ్యే వరకు తల్లడిల్లిపోతుంది.
కన్న బిడ్డకు చిన్న దెబ్బ తగిలితేనే తల్లి తట్టుకోలేదు. బిడ్డకు నయమయ్యే వరకు తల్లడిల్లిపోతుంది. అలాంటిది ఓ తల్లి తన కూతురి పట్ల కర్కశంగా వ్యవహరించింది. ఏకంగా నాలుగో అంతస్థు నుంచి కూతురిని కిందికి విసిరేసి చంపేసింది. బెంగళూరులో (Bengaluru) జరిగిన ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు అపార్ట్మెంట్ సీసీటీవీ కెమెరాలో నమోదయ్యాయి. ఉత్తర బెంగళూరు ఎస్ఆర్ నగర్లోని అపార్ట్మెంట్లో ఈ ఘటన గురువారం జరిగింది.
ఇది కూడా చదవండి..
Haryana Cop With Axe: గొడ్డలితో రెచ్చి పోయిన ట్రాఫిక్ కానిస్టేబుల్.. నడిరోడ్డుపై వీరంగం!
అక్కడి అపార్ట్మెంట్ నాలుగో అంతస్థులో నివసిస్తున్న ఓ మహిళ తన నాలుగేళ్ల కూతురిని గురువారం బాల్కనీ నుంచి కిందకు విసిరేసింది. అనంతరం తను కూడా అక్కడి నుంచి దూకెయ్యాలనుకుని బాల్కనీ రెయిలింగ్ ఎక్కింది. అయితే అప్పటికే అక్కడకు చేరుకున్న కుటుంబ సభ్యులు ఆమెను కాపాడారు. కాగా, కింద పడగానే ఆ చిన్నారి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. కాగా, ఆ నాలుగేళ్ల బాలిక పుట్టినప్పటి నుంచి మాట్లాడలేదు, వినలేదు. దీంతో ఆ బాలిక తల్లి మానసిక ఒత్తిడికి గురైంది.
నిందితురాలు ఒక డెంటిస్ట్ (Dentist) కాగా, ఆమె భర్త సాఫ్ట్వేర్ ఇంజినీర్. భర్త ఇచ్చిన ఫిర్యాదుతో నిందితురాలిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. మానసిక సమస్యలతో బాధపడుతున్న ఆమెను విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.